Thursday 16 January 2014

మామిడి తోరణాలు

గృహప్రవేశ సమయంలో మామిడి తోరణాలు ఎందుకు కడతారు?

నూతన గృహంలోకి ప్రవేశించే ముందు మామిడి తోరణాలను కడుతుంటారు. అలాగే పండుగల సమయాలలో కూడా మామిడి తోరణాలు కట్టడం జరుగుతోంది. మామిడి తోరణాల ప్రయోజనం తెలియకనే జనులు దగ్గరగా కూర్చి మామిడాకు తోరణాలను ప్రవేశ ద్వారాల వద్ద కట్టుతుంటారు. అలాగే గృహప్రవేశ సమయంలో మద్యగదిలో కొత్త పాత్రలో పాలు పొంగీయడం మనం చూస్తున్నాం. ఆ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంటుంది. పాలు మసిలి పొంగి నేలపైకి తొరలడం గృహప్రవేశ సమయంలో ఎంతో శుభసూచకంగా చెప్పబడును. గౄహప్రవేశ కార్యం అయిన ఇంట్లోకి మామిడితోరణాలు కళకళలాడూతూ అతిథులకు స్వాగతం పలుకుతున్నట్లు ఉంటాయి. ఈ ఆచారము వెనుక ఓ శాస్త్రీయ విషయాన్ని గ్రహించారు కాబట్టే, అనేక శుభకార్యాలలో మామిడి ఆకును వాడేవారు. గృహప్రవేశ సమయంలో అనేక బంధుమిత్రులు ఇంట్లోకి రావడం జరుగుతుంది. ఈ కారణంగా సహజంగానే ఇంట్లోని గాలి కలుషితమౌతుంది. అయితే మామిడాకులకు గాలిని శుద్దిచేసే గుణం ఉండటం కారణంగా తోరణాలను ద్వారాలను దట్టంగా కట్ట్డం జరుగుతుంది. మామిడాకులకు పళ్ళలోని సూక్ష్మక్రిములను హరించే సామర్ధ్యమున్న కారణంగా మన పూర్వులు పళ్ళు తోమడానుకి మామిడి ఆకులను ఉపయోగిస్తుండేవారు. బావిలోనికి దిగి శుభ్రము చేయువారికి మొదట ఓ మామిడాకులు ఎక్కువగా ఉన్న కొమ్మను బావిలోకి దించి, చుట్టుతా కొంతసేపు తిప్పమని చెప్పబడేది. ఇలా చేయడంవల్ల బావిలో ఉన్న విషయాయువులు తొలగించబడతాయి. ఇలా చేయువారు గ్రామీణ ప్రాంతాలలో మనదేశంలో ఇప్పటికి కనిపిస్తారు. కాబట్టి పెద్దల మాట చద్దిమూటలా మనం భావించాలి.

No comments:

Post a Comment