Monday 12 May 2014

నృసింహ జయంతి


నృసింహ జయంతి వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు జరుపుకుంటారు. ఈ రోజు సాయంకాలం నరసింహ మూర్తి హిరణ్య కశిపుని వధించడానికి ఆతని ఆస్థాన మండప స్తంభము నుండి ఉద్భవించెను.

"వైశాఖశుక్లపక్షేతు చరుర్దశ్యాం సమాచరేత్,మజ్జన్మసంభవం పుణ్యం వ్రతం పాపప్రణాశనమ్"


అని నరసింహుడు ప్రహ్లాదునితో పేర్కొన్నట్లుగా నృసింహ పురాణము లో కలదు.శ్రీవైష్ణవులు సంప్రదాయానుసారంగఅ త్రయోదశి (ముందు రోజు) నాటి రాత్రి ఉపవాసం ఉండి, చతుర్దశి నాడు కూడా ఉపవాసం ఉండి, ప్రదోష కాలమున నృసింహ విగ్రహమును పూజించుతారు. స్తంభములో జన్మించాడు గనుక భవంతి స్తంభములకు తిరుమణి, తిరు చూర్ణములు పెట్టి పూజిస్తారు. రాత్రి జాగరణము చేసి, స్వర్ణసింహ విగ్రహమును దానమిచ్చి, మరునాడు పారణ చేయుదురు. వైశాఖము గ్రీష్మము గనుక వడపప్పు, పానకము ఆరగింపు పెడతారు.




Friday 9 May 2014

సత్యనారాయణ వ్రత విధానం

సత్యనారాయణ వ్రత విధానం: ఉదయాన్నే లేచి నిత్యకర్మలు పూర్తి చేసుకుని, స్వామి వారిని మనసులో తలచి "ఓ దేవ దేవా! శ్రీ సత్యనారాయణమూర్తీ! నీ అనుగ్రహము కోరి భక్తి శ్రద్ధలతో నీ వ్రతము చేయుచున్నాను " అని సంకల్పించుకోవలెను. మధ్యాహ్మ సమయంలో పనులన్ని పూర్తి చేసుకుని సాయంకాలం రాత్రి ప్రారంభమవుతుండే సమయంలో ఈ వ్రతమును చేయవలెను. ( నేడు అందరూ సాయంత్రం వరకూ ఉపవాసం ఉండలేక ఉదయాన్నే చేసుకొను చున్నారు. సాయంత్రం శ్రేష్ఠమైనది. ఇక చేయలేని సమయంలో ఉదయాన్నే చేయటం రెండవ పక్షం. ఏదైనా చేసిన కాసేపూ పూర్తి మనసుతో చేయడం మంచిది. )

శుచి అయిన ప్రదేశంలో గోమయముతో అలికి, అయిదు రంగుల చూర్ణములతో ( పొడులతో ) ముగ్గులు పెట్టి, అచట ఆసనము ( వ్రతం పీట )వేసి, దానిపై కొత్త వస్త్రము( తెల్ల టవల్ ) పరిచి, దానిమీద బియ్యము పోసి, దాని మధ్యలో కలశము ( మట్టి,రాగి, వెండి లేదా బంగారం ) ఉంచి, దానిపై మరల కొత్త వస్త్రమును ( జాకెట్ పీస్ ) ఉంచవలెను. ఆ వస్త్రము మీద ప్రతిమా రూపుడైన సత్యనారాయణ స్వామిని ఉంచవలెను. ( శక్తిమేర ఓ ప్రతిమను బంగారంతో చేయించి, పంచామృతములతో అభిషేకించి, దానిని కలశముమీద ఉంచ వలెను. )

ఆ మండపములో బ్రహ్మాది పంచలోక పాలుకులను, నవగ్రహములను,అష్ట దిక్పాలకులను ఆవహన చేసి పూజించ వలెను. తరువాత కలశములో స్వామివారిని ఆవాహన చేసి పూజించ వలెను. పూజానంతరము కథ విని ప్రసాదమును బ్రాహ్మలతోను, బంధువులతోనూ గూడి స్వీకరించ వలెను.

ఈ వ్రతాన్ని వైశాఖ మాసములో గానీ, మాఘమాసమున గానీ, కార్తీక మాసమున గానీ శుభదినమున చేయవలెను. కలతలతో నున్నవారు చేయటం చాలా మంచిది. శుభకార్యాలలో చేయటం నేడు ఆచారంగా వస్తున్నది. ఈ వ్రతాన్ని నెలకు ఒక సారి కానీ , సంవత్సరానికి ఒక సారి కానీ చేయవచ్చును. ఎవరి శక్తిని బట్టి వారు చేయ వచ్చును. ( కొత్తగా పెళ్లైన దంపతులకు నేను నెలకు ఒక సారి చొప్పున చేయించాను. వారు చాలా అన్యోన్యంగా,సంతోషంగా గడపడం నెను గమనించాను. కనీసం సంవత్సరానికి ఒక్క సారైనా ఈ వ్రతం చేయమని నా సలహా )

పూజ చేసిన నాడు ఏకభుక్తము ( ఒక పూట మాత్రమే భుజించుట ) చేయ వలెను. బ్రహ్మ చర్యము పాఠించ వలెను. మనసును, బుద్ధిని, కర్మలను మంచి వాటిపై నిలుప వలెను. (ఆ ఒక్క రోజు అయినా)సత్యమునే పలకవలెను. ఎంత శ్రద్ధతో, నిష్ఠతో చేస్తే అంత సత్ఫలితాన్నిస్తుంది.

Thursday 8 May 2014



కాలజ్ఞాన రూపకర్త శ్రీ పోతులూరి వీర బ్రహ్మంగారి ఆరాధనా

పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పేరు వినగానే మనకు జ్ఞాపకమొచ్చేది కాలజ్ఞానం. భవిష్యత్తును పాట రూపంలో చెప్పిన ఈయనకు కాలజ్ఞానంపై సినిమాలు కూడా రూపొందిచారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 17వ శతాబ్దానికి చెందినవారు. పశువుల కాపరిగానే ఉంటూ తన మహత్తర కంఠస్వరంతో తత్వాన్ని జనానికి భోధించిన యోగి.

ఈయన సమాజంలోని కుల జాఢ్యాన్ని రూపుమాపడానికి కృషి చేశారు. ఈయనకు అత్యంత ప్రీతిపాత్రమైన శిష్యుడు సిద్దయ్య దూదేకుల కులానికి చెందిన వాడు. మరొక భక్తుడు కక్కయ్య ఇంకొక కులానికి చెందినవాడు ఇలా వివిధ కులాలకు చెందిన వారిని దరిన చేర్చుకుని తన తత్వాన్ని జనంలోకి ప్రచారం చేశారు. 





కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండంలోని ఆయన పేరిట పెద్ద మఠం ఉంది. ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఆయన పేరిటే ఆ మండలం ఏర్పడింది. సంఘసంస్కర్త అయిన ఆయన తన కాలజ్ఞానములో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయని చాలా మంది నమ్మకం.

కడప జిల్లా లోని కందిమల్లాయపల్లిలో బ్రహ్మంగారు సజీవ సమాధి అయ్యారు. వీరబ్రహ్మంగారి వలనే కందిమల్లాయపల్లె తర్వాతి కాలములో బ్రహ్మంగారిమఠంగా ప్రసిద్ధి చెందింది. కర్ణాటక, తమిళనాడులతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడకు వెళ్ళడానికి మైదుకూరను నుంచి బస్సుసౌకర్యం ఉంది. 

అందరూ కలిసిమెలిసి జీవించండి. ఆనందంగా ముందుకుసాగండి అన్నారు స్వామి. ఆయన ఆధాత్మిక జీవనవిధానం చక్కగా దోహదం చేస్తుంది. అది వ్యక్తిస్వర్ధాన్ని పక్కకుపెట్టి త్యాగాన్ని వృద్దిచేస్తుంది. తద్వారా పరహితం కోరగలరు. స్వహితం కొంత పక్కన పెట్టగలరు. సాధనతో ముందుకుసాగితే ఇంకా వివేకవంతులై నవ్య సమాజానికి బాటలు వేయగలరని ఉద్బోధించారు స్వామి. కనుక స్వామిచెప్పిన మార్గాన్ని అవలంబించి సమాజహితులమై శ్రేయో మార్గాన్ని అవలంబిస్తు; కావున అందరూ వైశాఖశుద్ధ దశమి బ్రహ్మంగారి ఆరాధన జరుపుకొనవలెను. వీలయినవారు బ్రహ్మంగారి మఠం (కందిమల్లయ్యపల్లి) దర్శించగలరు. అంతేగాక ఆర్థిక స్తోమత లేనివారు తమ తమ గృహములలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి అష్టోత్తరపూజ చేసి నివేదన జేయగలరు. బ్రహ్మంగారి కళ్యాణము (కందిమల్లయ్యపల్లి) బ్రహ్మంగారి మఠము నండు మహాశివరాత్రిపర్వదినమున అత్యంత వైభవోపేతంగా జరుగును. కావున తప్పక దర్శించగలరు.

Sunday 27 April 2014

పెద్దబాలశిక్ష గ్రంథంలాంటిది

సాంప్రదాయమైన తెలుగు విద్యాభ్యాసంలో ‘పెద్దబాలశిక్ష’ ఆది గ్రంథంలాంటిది. మహాభారతంలాగానే పెద్దబాలశిక్షను కూడా పద్దెనిమిది పర్వాలుగా విభజించారు. అందుకే దీనిని ‘బాలల విజ్ఞానసర్వస్వం’గా భావిస్తారు. పూర్వం ఆంధ్రదేశంలోని ప్రతి విద్యార్థి పెద్దబాలశిక్షతోనే చదువు ప్రారంభించేవారు. ఐదవ తరగతి పూర్తయ్యేసరికి పెద్దబాలశిక్ష కంఠపాఠమవ్వాలి. ఆంగ్లేయుల కాలంలో ఆంధ్రదేశంలోని అన్ని పాఠశాలల్లోను పెద్దబాలశిక్ష పాఠ్యాంశంగా ఉండేది.

నేపథ్యం...
ఆంగ్లేయుల దగ్గర రెవెన్యూ శాఖలో పనిచేస్తూన్న స్థానికుల కోసం, 1832లో ‘మేస్తర్ క్లూలో’ అనే తెల్లదొర ‘పుదూరు చదలవాడ సీతారామశాస్త్రి’ అనే పండితుడి చేత ‘బాలశిక్ష’గ్రంథాన్ని రచింపచేశాడు. పిల్లలకు తేలికగా అర్థమవ్వాలనే లక్ష్యంతో ఈ పుస్తక రూపకల్పన జరిగింది. ఇది 1856 నాటికి 78 పుటలతో పుస్తక రూపంగా వెలువడింది. ఇటువంటి పుస్తకం కోసం ఎదురుచూస్తున్న తెలుగువారు దీనిని మనసారా అక్కున చేర్చుకున్నారు.

1865లో వెలువడిన 90 పుటల బాలశిక్షలో, పాత ముద్రణలో లేని సాహిత్య విషయాలు, ఛందస్సు సంస్కృత శ్లోకాలు, భౌగోళిక విషయాలను చేర్చి, ‘‘బాలవివేక కల్పతరువు’’ గా రూపొందించారు. అప్పటిదాకా బాలశిక్షగా ప్రచారంలో ఉన్న పుస్తకం పెద్దబాలశిక్షగా కొత్తపేరును సంతరించుకుంది. ఇందులో భాష, సంస్కృతులకు కావలసిన భాషా విషయాలు, అక్షరాలు, గుణింతాలు, ఒత్తులు, సరళమైన పదాలు, రెండుమూడు అక్షరాలతో కూడిన మాటలు, తేలిక వాక్యాలు, నీతి వాక్యాలు, ప్రాసవాక్యాలు, సంప్రదాయ సంస్కృతికి సంబంధించినవీ అందరూ తెలుసుకోదగ్గవీ, అప్పటివరకు తెలిసి ఉన్న చారిత్రక భౌగోళిక విజ్ఞాన సంబంధ విషయాలు... వీటన్నిటినీ ఈ పుస్తకం లో పుదూరువారు పొందుపరిచారు.

పుదూరి వారి తర్వాత పేర్కొనదగిన పరిష్కరణ 1916 లో వచ్చిన వావిళ్ల వారిది. భాషోద్ధారకులు వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి 1949 పరిష్కరణలో... ‘‘భారతదేశమునకు స్వరాజ్యము లభించినందుకు ఇక ముందు దేశభాషలకు విశేషవ్యాప్తి ఏర్పడి, ఇట్టి (బాలశిక్ష) గ్రంథములకు వేలకువేలు ప్రచారమగునని తలంచుచున్నాను’’ అని చెప్పారు.

కొన్ని మార్పులు, చేర్పులతో ఎందరో ప్రచురణకర్తలు, ఎన్నో పండిత పరిష్కరణలతో నేటికీ వెలువడుతూనే ఉంది. పిల్లలకే కాకుండా పెద్దలకు సైతం తెలుగుదనాన్ని నేర్పి, చక్కని పండితపౌరులుగా తీర్చిదిద్దే సామర్థ్యం పెద్దబాలశిక్షకు ఉంది. 1983లో రాష్ట్ర ప్రభుత్వం దీని ప్రాశస్త్యాన్ని గ్రహించి కొన్ని భాగాల్ని పాఠ్యాంశాలుగా కూడ చేర్చింది. పత్రికాధిపతులు, విజ్ఞులు పెద్దబాలశిక్షను ‘గుణశీల పేటిక’ గా అభివర్ణించారు. నాటి నుంచి నేటివరకు పెద్ద బాలశిక్షను తెలుగువారంతా తమ మానసపుత్రికగా కాపాడుకుంటూనే ఉన్నారు. ఇంటింటా ఈ పుస్తకం ఉండటాన్ని గౌరవంగా భావిస్తున్నారు. తెలుగు సంవత్సరాలు, నక్షత్రాలు, రాశులు, చుట్టరికాలు, తిథులు, మాసాలు, ఋతువులు, వారాలు, అధిపతులు, సప్తద్వీపాలు, దశావతారాలు...వంటి అంశాలు ఇందులో ఉంటాయి.

ప్రస్తుతం తెలుగునాట పన్నెండు రకాలకు పైనే పెద్దబాలశిక్షలు లభిస్తున్నాయి. బుడ్డిగ సుబ్బరాయన్ రూపొదించిన ‘సురభి’ గాజుల సత్యనారాయణ ‘తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష’ విరివిగా లభిస్తున్నాయి. ఈనాటికీ ‘పెద్దబాలశిక్ష’ పేరుకు ఎంతో గౌరవం, ఆదరణ ఉన్నాయి. ‘పెద్దబాలశిక్ష’ వంటి పుస్తకం తెలుగువారి సొంతం. ఇది తెలుగుభాష గొప్పదనం, తెలుగుజాతి నిండుదనం, తెలుగువారి అదృష్టంగా భావించాలి. ప్రస్తుత ఈ పుస్తకం మూడు సంవత్సరాలలోపే 36 సార్లు ముద్రణ పొంది, రెండున్నర లక్షల ప్రతులు చెల్లాయి. పెద్దబాలశిక్ష పేరు చిరస్థాయిగా నిలిచితీరుతుంది.

Saturday 26 April 2014

భాగవతంలోని గజేంద్రమోక్షం లోని భాగం --- కరిఁ దిగుచు మకరి సరసికి

కరిఁ దిగుచు మకరి సరసికి
గారి దరికిని మకరిఁ దిగుచుఁ గరకరి బెరయన్
గారికి మకరి మకరికిఁ గరి
భరి మనుచును నతలకుతల భటు లరుదు పడన్ .




పోతన గారు రచించిన భాగవతంలోని గజేంద్రమోక్షం లోని భాగం లో రచించిన పద్యం ఇది. ఏనుగు నీరు త్రాగడానికి నదిలో దిగినప్పుడు ముసలి ఎనుగుపాదం తన నోటితో గట్టిగా పట్టుకుంది.

భావం :- ఒకరిపై ఒకరికి పగ పెరిగే విధముగా ముసలి, ఏనుగు ఆ నదిలో పోరాడుచున్నవి. ముసలి, ఏనుగును నదిలో లాగుచున్నది. ఏనుగు ముసలిని నెల పైకి ఈడ్చుచున్నది. ఒకదానికి ఒకటి భయపడకుండా పోరాడుచిన్నవి. 

రామాయణలో కథ కైక పాత్రకున్న ప్రాధాన్యం

రామాయణ కథని మలుపు తిప్పిన స్త్రీ పాత్రలలో కైకది ఒక కీలకమైన పాత్ర అని అందరికీ తెలిసిన విషయమే. దశరథుని ఆకాంక్ష మేరకు రాముని పట్టాభిషేకం జరిగిపోయుంటే, రామాయణం అక్కడితో ఆగిపోయేది.


అది కాకుండా మలుపు తిప్పినది కైక. అయితే, వాల్మీకి రామాయణంలో కైక పాత్ర కీలకమైనదే కాని, చాలా పరిమితమైనది. కేవలం రామపట్టాభిషేక సందర్భంలో, అలుక పూని, వరాలడిగి, పట్టాభిషేకం చెడగొట్టి, రాముడిని అడవులకి పంపించడం వరకే ఆమె పాత్ర మనకి ప్రముఖంగా కనిపిస్తుంది వాల్మీకంలో. ఆ తర్వాత కథని ముందుకి నడిపించేది సీత. రాముని సర్వ ప్రయత్నమూ సీత కోసమే. ముందుగా లంకలోకి ప్రవేశించి, లంకని సర్వనాశనం చేసి, చివరకి రావణునితో పాటు సర్వ రాక్షస సంహారానికీ కారణమైనది సీతే. అందుకే వాల్మీకి మహర్షి రామాయణాన్ని గురించి “సీతాయాశ్చరితం మహత్” అన్నది. అంతటి సీత పాత్రకి సరిజోడుగా, అంతటి ప్రాధాన్యమున్న పాత్రగా కల్పవృక్షంలో కైకని తీర్చిదిద్దారు విశ్వనాథ.  రావణసంహారం చేసి వనవాసం ముగించుకొని సీతారామలక్ష్మణులు అయోధ్యకు తిరిగి వచ్చిన్నప్పుడు కైకేయి సీతని కౌగిట చేర్చుకొని యిలా అంటుంది

కైకెయి సీత గౌగిటికి గైకొని, “ఓసి యనుంగ! నీవుగా
గైకొని యీ వనీచయ నికామ నివాసభరంబిదెల్లనున్
లోకము నన్ను తిట్టుట తలోదరి! మార్చితి, కైక పంపెనే
గాక దశాననాది వధ కల్గునె యన్న ప్రశంస లోనికిన్”


“కైక రాముడిని అడవులకి పంపేసింది” అనే నిందని, “ఆహా! కైక పంపినందువల్లనే కదా రావణాది రాక్షసుల సంహారం చేసి రాముడు దిగంత కీర్తి సంపాదించాడు” అనే ప్రశంసగా మార్చేసిందట సీత. అంతే కదా! రామాయణానికి మరో పేరు “పౌలస్త్య వధ”. అంటే, రామాయణ కథకి అంతిమ గమ్యం రావణ వధ. దానికి కైక వరాలే కదా కీలకం! విశ్వనాథవారీ కీలకాన్ని గ్రహించి, కైక పాత్రని దానికి అనుగుణంగా తీర్చిదిద్దారు. మొదట తల్లిని తీవ్రంగా దూషించిన కన్నకొడుకు భరతుడే కల్పవృక్షం చివరలో, “కైకేయీ సముపజ్ఞ మియ్యది జగత్కల్యాణ గాథా ప్రవాహాకారంబయి పొల్చు రామకథ” అని అనుకుంటాడు. అదీ రామాయణ కల్పవృక్షంలో కైక పాత్రకున్న ప్రాధాన్యం.

Friday 25 April 2014

తెలుగు నెలలు (తెలుగు మాసములు)

తెలుగు నెలలు (తెలుగు మాసములు)
తెలుగు నెలలు పన్నెండు. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి) తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది.
ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి:
శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పున్నమి వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని అర్థం).
కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం).


తెలుగు నెలలు :
చైత్రము
వైశాఖము
జ్యేష్ఠము
ఆషాఢము
శ్రావణము
భాద్రపదము
ఆశ్వయుజము
కార్తీకము
మార్గశిరము
పుష్యము
మాఘము
ఫాల్గుణము
ఈ నెలల పేర్లు ఒక్కో నక్షత్రం పేరు మీద ఒక్కొక్క నెల ఏర్పడినట్లు సులభంగా గుర్తించవచ్చు.
పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల చైత్రము .
పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం (అనగా చంద్రుడు విశాఖ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల వైశాఖము.
పౌర్ణమి రోజున జ్యేష్ఠ నక్షత్రం (అనగా చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల జ్యేష్ఠము .
పౌర్ణమి రోజున పూర్వాషాఢ నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాషాఢా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల ఆషాఢము.
పౌర్ణమి రోజున శ్రవణం నక్షత్రం (అనగా చంద్రుడు శ్రవణం నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల శ్రావణము .
పౌర్ణమి రోజున పూర్వాభాద్ర్హ నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాభాద్రా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల భాద్రపదము.
పౌర్ణమి రోజున అశ్వని నక్షత్రం (అనగా చంద్రుడు అశ్వనీ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల ఆశ్వయుజము.
పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రం (అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల కార్తీకము.
పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రం (అనగా చంద్రుడు మృగశిరా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల మార్గశిరము .
పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రం (అనగా చంద్రుడు పుష్యమీ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల పుష్యము.
పౌర్ణమి రోజున మఖ నక్షత్రం (అనగా చంద్రుడు మఖా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల మాఘము.
పౌర్ణమి రోజున ఉత్తరఫల్గుణి (ఉత్తర) నక్షత్రం (అనగా చంద్రుడు ఉత్తరఫల్గుణీ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల ఫాల్గుణము.

ఋణ విమోచన నృసింహ స్తోత్రం

ఋణ విమోచన నృసింహ స్తోత్రం



దేవతా కార్య సిద్ధ్యర్థం సభా స్తంభ సముద్భవమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౧ ||
లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౨ ||
ఆంత్ర మాలాధరం శంఖ చక్రాబ్జాయుధ ధారిణం |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౩ ||
స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౪ ||

Wednesday 23 April 2014

సాలగ్రామాలు

సాలగ్రామము విష్ణుప్రతీకమైన , విశిష్ట ప్రాముఖ్యం కలిగిన ఒక శిలా విశేషము. కలికాలంలో భక్తుల అర్చనాదుల సౌలభ్యం కోసం నారాయణుడు సాలగ్రామ రూపం ధరించాడని దేవీభాగవతం చెబుతుంది. అందుచేతే గృహదేవతార్చనలలోగానీ, దేవాలయాలలోగానీ సాలగ్రామము (మూర్తి) లేకుండా పూజలు కొనసాగవు. ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు తమతమ దేవతార్చనలలో సాలగ్రామములను పూజకు ఉపయోగిస్తారు. భారతదేశంలో సాలగ్రామ పూజ బహు పురాతనమైనది. క్రీస్తు కంటే ప్రాచీనుడైన అపస్తంబుడు సాలగ్రామ పూజను పేర్కొన్నాడు. త్రిమతాచార్యులు తమతమ భాష్యాలలో సాలగ్రామాలు విష్ణురూపాలని వివరించారు. దేవాలయాలలో పంచాయతన మూర్తులకు శిలా ప్రతిమలు ఉంటే గృహస్థులకు మణి, స్వర్ణ నిర్మితమైన మూర్తులు, సాలగ్రామములు ఉంటాయి. సాధారణంగా ప్రతిమలకు నిత్య పూజా సమయంలో ఆవాహనాది షోడశోపచారాలు చేయాలి. సాలగ్రామాలలో దేవత నిత్యం సన్నిహితమై ఉండడం వల్ల వాటికి పూజా సమయంలో అవాహనాది ఉపచారాలు అవసరం లేదు.

 సాలగ్రామాలు గండకీ నదిలో లభిస్తాయి
పంచాయతనం
పంచాయతనం లో ఉండే ఐదు మూర్తులు:
ఆదిత్యం - స్ఫటికం
అంబికాం - లోహం
విష్ణుం - సాలగ్రామం
గణనాథం - ఎర్రరాయి
మహేశ్వరం - బాణం
ఈ ఐదింటికీ పూజ చేయడాన్ని పంచాయతన పూజ అంటారు. వీటిలో ఏది మధ్యలో ఉంటే ఆ పంచాయతనం అంటారు. సాలగ్రామాన్ని మధ్యలో ఉంచితే 'ఆదివిష్ణు పంచాయతనం' అంటారు.



సతీ తులసి కథ
పూర్వం జలంధరుడనే రాక్షసుడు ముల్లోకాలను పీడించేవాడు. మునులు, దేవతలు తమను రక్షించమని విష్ణువుతో మొరపెట్టుకున్నారు. జలంధరుడి భార్య వృందాదేవి చేసే పూజల ఫలం రక్షణ మూలంగా జలంధరున్ని చంపడం శివుడివల్ల కూడా కాలేదు. దాంతో విష్ణుమూర్తి మాయా జలంధరుడి వేషంలో వెళ్ళి వృందాదేవి పాతివ్రత్యాన్ని భంగపరిచాడు. వెంటనే శివుడు జలంధరున్ని సంహరించాడు. అసలు విషయం తెలుసుకున్న వృందాదేవి కఠినశిలవైపొమ్మంటూ విష్ణువును శపించింది. విష్ణుమూర్తి ఆమె పాతివ్రత్యాన్ని మెచ్చి అనుగ్రహించగా తులసి మొక్కగా మారింది. విష్ణువు సాలగ్రామ రూపు ధరించాడు.
గండకీనదిలో లభించే సాలగ్రామాలు అనేక రకాలుగా ఉంటాయి. అవి లక్ష్మీనారాయణుడు, లక్ష్మీజనార్ధనము, రఘునాధము, వామనము, శ్రీధరము, దామోదరము, రఘురామము, రారాజేశ్వరము, అనంతము, మధుసూదనము, హయగ్రీవము, నారసింహము, లక్ష్మీనృసింహము. ప్రతిరోజూ సాలగ్రామము, తులసి, శంఖాలను పూజించేవారికి వైకుంఠం ప్రాప్తిస్తుందని పురాణకథనం.
మరికొన్ని విశేషాలు


సాలగ్రామాల రంగు, వాటిమీద ఉండే ముద్రలను బట్టి ఎన్నో రకాలు ఉన్నాయి. అలాంటి 12 రకాల సాలగ్రామాలు ఉండి పూజింపబడే ఇల్లు 108 వైష్ణవ దివ్యక్షేత్రాలతో సమానం అని అంటారు.
సాలగ్రామాలను కొంచెం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. వాటికి నిత్యం అభిషేకం, నైవేద్యం చేయాలి. అలా చేయలేనివారు వాటిని వేరెవరికైనా దానమివ్వడం మంచిది. ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు కొందరు వాటిని పూర్తిగా నీళ్ళల్లో మునిగేలా ఉంచుతారు. దానిని జలవాసం అంటారు. ఏదైనా ఆలయంలో దానిని ఉంచవచ్చును.
సాలగ్రామాలను కొనరాదు. ఇవి వంశపారంపర్యంగా రావాల్సిందే. అందుకే సాలగ్రామ దానం మహాదానం అని పెద్దలు అన్నారు.

Sunday 9 February 2014

మామిడాకుల ప్రాముఖ్యత-


ప్రేమకు, సంపదకు, సంతానాభివృద్ధికి ప్రతీక మామిడి. జీవితంలో ముఖ్యమైన ఈ మూడింటినీ అందించే మొక్కగా మామిడిని పూజిస్తారు రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలతో పాటు అనేక ఇతర పురాణాలలో మామిడిమొక్కల ప్రస్తావన ఉంది.

మామిడాకుల పాత్ర లేకుండా ఏ శుభకార్యం జరగదు. మంగళతోరణాలు కట్టేందుకు వాడేది మామిడి ఆకులనే. పూజకు ముందుంచే పూర్ణకుంభంలో అమర్చేది మామిడి ఆకులనే.

పూర్ణకుంభమంటే భూదేవిరూపం. అందులో పోసే నీరు మనజీవితానికి మూలాధారమైనవి. ఆ కుంభంలో ఉంచే కొబ్బరికాయ, అమర్చే మామిడి ఆకులు జీవితాన్ని సూచిస్తాయి. ఆ పూర్ణకుంభం అమరిక లక్ష్మీదేవి రూపమవుతుంది.

మామిడి తోరణాలు శుభకార్యాలకు కడతారు. భగవంతుని పూజించేందుకు మామిడిని వాడతారు. భారతీయ సాహిత్యంలో మామిడిని స్తుతించిన విధంగా మరొకచెట్టును స్తుతించలేదు. దీనిని కల్పవృక్షమన్నారు. మామిడి పువ్వును మన్మథుని బాణాలలో ఒకటిగా కాళిదాసాది కవులు వర్ణించారు.

క్రీ.పూ. 150 కాలం నాటి సాంచీ స్థూపంమీద మామిడిచెట్టు, పండ్లు అద్భుతంగా చెక్కడం కనిపిస్తుంది. శిల్పకళతో పాటు అనేక ఇతర హస్తకళల్లో మామిడిరూపం కనిపిస్తుంది.!!!

Friday 31 January 2014

నవగ్రహ జపం



విద్య, ఉద్యోగం, పెళ్లి, సంతానం, ఇల్లు సమస్య ఏదైనా దానికి సత్వరం చక్కని పరిష్కారం దొరకాలంటే మీరు నవగ్రహాలను శరణు వేడ వలసినదే. దానికి చక్కని మార్గం నవగ్రహ జపం. ఇది సాధారణంగా స్వయంగా చేసుకోవాలి. కానీ దానికి గట్టినమ్మకం, సంకల్పం కావాలి. సంఖ్య ఎక్కువ ఉంటుంది కనుక చాలా మంది పూర్తి చేయలేరు. అటువంటి వారు బ్రాహ్మణులను పెట్టుకుని జపం చేయించుకోవాలి. బ్రహ్మణులను పెట్టుకుని జపం చేయించుకుంటే వారు వేద ప్రోక్తమైన మంత్రాలను జపం చేస్తారు. స్వయంగా చేసుకునే జపమే ఉత్తమం. స్వయంగా చేసే వారు " నవగ్రహ శ్లోకాలను" జపం చేయాలి.

ఈ నవగ్రహ శ్లోకాలు మీ కష్టాలను/ ఈతిబాధలను తొలగించి, కోరిన కోరికలను తీర్చడంలో అద్భుతంగా పనిచేస్తాయి. దారిద్ర్య దుఃఖ బాధలు, శారీరక మానసిక రోగ రుగ్మతలు తొలగుతాయి. సర్వ కార్య విజయాలు, విద్యా ఉద్యోగ వ్యాపారాది లాభాలు, మనోవాంఛలు తీరును. ప్రతీ గ్రహము ఒక్కో ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుంది. అలాగే మీ జాతక చక్ర రీత్యా ఒక్కో ఫలితాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది.

నవగ్రహ శ్లోకాలు:

నవ గ్రహ శ్లోకం :

ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః

రవి: 6000 సార్లు
జపాకుసుమ సంకాశం, కాస్యపేయం మహాద్యుతిం,
తమోరిం సర్వ పాపఘ్నం, ప్రణతోస్మి దివాకరం.

చంద్ర: 10,000 సార్లు
దధి శంఖ తుషారాభం, క్షీరో దార్ణవ సంభవం,
నమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం.

కుజ: 7,000 సార్లు
ధరణీ గర్భ సంభూతం, విద్యుత్ కాంతి సమప్రభం,
కుమారం శక్తి హస్తం, తం మంగళం ప్రణమామ్యహం.

బుధ: 17,000 సార్లు
ప్రియంగు కలికా శ్యామం, రూపేణా ప్రతిమం బుధం,
సౌమ్యం సత్వ గుణేపేతం, తం బుధం ప్రణమామ్యహం.

గురు: 16,000 సార్లు
దేవానాంచ ఋషీణాంచ, గురుం కాంచన సన్నిభం,
బుద్ధి మంతం త్రిలోకేశం, తం నమామి బృహస్పతిం.

శుక్ర: 20,000 సార్లు
హిమకుంద మృణాళాభం, దైత్యానాం పరమం గురుం,
సర్వ శాస్త్ర ప్రవక్తారం, భార్గవం ప్రణమామ్యహం.

శని: 19,000 సార్లు
నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం,
ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం.

రాహు: 18,000 సార్లు
అర్థకాయం మహావీరం, చంద్రాదిత్య విమర్ధనం,
సింహికా గర్భ సంభూతం, తం రాహుం ప్రణమామ్యహం.

కేతు: 7,000 సార్లు
ఫలాశ పుష్ప సంకాశం, తారకా గ్రహ మస్తకం,
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం, తం కేతుం ప్రణమామ్యహం.

ఈ నవగ్రహ శ్లోకాలు ఎవరైనా పఠించవచ్చు. పైన గ్రహ శ్లోకాలు వాటి ప్రక్కనే చేయవలసిన జపసంఖ్య చెప్పడం జరిగింది. ఒక్కో సారి పరిస్ఠితుల తీవ్రతను బట్టి 2,3 లేక 4 గ్రహాలకు కూడా జపాలు చేసుకోవలసి రావచ్చు. ఆ జపసంఖ్యను పూర్తిచేయడానికి చాలాసమయం పడుతుంది కనుక ఒకేరోజులో పూర్తిచేయవలసిన అవసరం లేదు. కొన్ని రోజులు ( ఉదా: 3 లేదా 5 లేదా 9 లేదా 11 లేదా 21 లేదా 41) నియమం పెట్టుకుని రోజుకి కొంత పూర్తి చేసుకుని, ఆ గ్రహానికి ఇష్టమైన ధాన్యం ఇష్టమైన వారంలో దానం చేయడం ద్వారా ఆశించిన ఫలితాలను పొందవచ్చు. నవ గ్రహాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే నవ గ్రహాలను ప్రార్ధించడం ద్వారా ధర్మ బద్ధమైన మీ కోరిక ఎంతటిదైనా ఖచ్చితంగా తీరుతుంది. ముందుగా మీకున్న సమస్య ఏమిటో, దాన్ని తీర్చగలిగే శక్తి ఏ గ్రహానికుందో తెలుసుకోవటానికి అనుభవజ్ఞులైన జోతీష్యులను సంప్రదించి వారి సలహాపై జపం ప్రారంభించాలి.

ఈ 41 రోజులు దీక్షపూని, సాత్విక ఆహారాన్ని భుజిస్తూ, మితంగా మాట్లాడుతూ ఉండాలి. ఉదయాన్నే చేసే జపం సంఖ్యానియమం కలిగి ఉండాలి. అంటే రోజుకు వెయ్యి చేస్తాననో, రెండు వేలు అనో నియమం పెట్టుకోవాలి. అది ఎట్టి పరిస్థితులలోనూ ఆపకుండా సంఖ్య పూర్తి అయ్యే వరకూ రోజూ చెయ్యాలి. అలాగే మిగతా సమయంలో ( పనులు చేసుకుంటున్నప్పుడు ) కుడా వీలయినన్ని సార్లు ఆ శ్లోకాన్ని చదువుతూ ఉండాలి. కానీ ఉదయం పూజా స్థలంలో కూర్చుని చదివే సంఖ్య మాత్రమే లెక్కకు వస్తుంది.

యోగాసనాలు సూర్యనమస్కారాలు


యోగ విద్య నభ్యసించుటకు వయో పరిమితి లేదు. ఏ వయస్సు వారైనను యోగ విద్య నభ్యసించ వచ్చును. కాన స్త్రీ, పురుషులెల్లరు వయోభేదము లేక, యోగ విద్య నభ్యసించి తమ ఆరోగ్యమును కాపాడు కొనుచూ శత వత్సరములు వర్దిల్ల గలరు. ముఖ్యముగా ఉద్యోగము, వ్యాపారము చేయు వారిలో ఎక్కువమంది శరీర శ్రమ లేకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు తమ విధులను నిర్వర్తించుచుందురు. అట్టి వారు తప్పక యోగ, వ్యాయామము నభ్యసించవలెను. వారు యోగ విద్య నభ్యసించని యెడల వారి శరీరమునకు శ్రమ లేక, భుజించిన ఆహారము సరిగా జీర్ణము కాక క్రమముగా అజీర్ణవ్యాది ప్రారంబించును.అజీర్ణ వ్యాధి కారణముగా మధుమేహ వ్యాధి (షుగరు వ్యాధి )కి గురియగుదురు. మధుమేహ వ్యాధి ఇతర వ్యాదులన్నింటికి మూల కారణ మని (diabities is the root cause of all diseases ) శాస్త్రజ్ఞులు చెప్పుచున్నారు కనుక ప్రతివారు మధు మెహ వ్యాధి నుండి కాపాడ బడవలయునంటే యోగ, వ్యాయామము తప్పక అభ్యసించవలెను. ప్రతి వారు

ఆరోగ్యవంతులై దీర్ఘాయుష్మంతులగుటకు తప్పక యోగాభ్యాసము చేయవలెను.

పాటించవలసిన నిబంధనలు:

1 . మితాహారమును సేవిన్చావలయును.అనగా ఎంత ఇష్టమైన పదార్ధమైనను అతిగా భుజించరాదు .

2 . మద్యపానము చేయరాదు .

3 . ధూమపానము చేయరాదు (పొగ త్రాగరాదు )

4 . కాఫీ, టీ, మొదలగు వుత్తేజకాలను అతిగా వాడరాదు.

5 . ఘాటైన పదార్ధములను అనగా సుగంధ ద్రవ్యములు, కూరలలో వాడుకొను మిరియాలు, జీలకర్ర, యాలుకలు, లవంగాలు మొదలగునవి తగ్గించి వాడు కొనవలయును. అనగా మషాలా దినుసులు తగ్గించి వాడు కొనవలయును.

6 . మాంసాహారము విసర్జించుట మంచిది.మానలేనివారు వారమున కొకసారి లేక పది రోజులకొకసారి వాడు కొనవలయును.

7 . అతి చల్లని, అతి వేడి పదార్దములు వాడరాదు.

8 .గాలి వెలుతురు దారాళముగా ప్రసరించు ఇంటిలో నివసించవలయును .

9 . ప్రతి రోజు ఉదయం 4 .30 గం || లకు లేచి తన దినచర్యలు ప్రారంబించ వలయు

10 .మంచి వాతావరణము ఉన్నచోట నివాసయోగ్యము.

11 . ప్రతి రోజు కనీసము 6 గం || లు నిద్రించవలెను.

12 . పగటి నిదుర పనికి రాదు, రేయి నిదుర కాయరాదు.

13 . ప్రతి దినము ఉదయము 4 .30 గం ||ల నుండి 8 గం || ల మధ్య యోగ వ్యాయాయము చేయవలెను.

14 . చంటి పిల్లలు ప్రతి రోజు 8 గంటల నుండి 10 గంటలు, 12 గంటలు నిదురించవలయును.

15 . యోగ విద్య నభ్యసించు పురుషులు కట్ డ్రాయరు గాని, లంగోటా కాని వాడ రాదు. ప్రత్యేకముగా గోచీ గుడ్డ కుట్టించుకొని వాడవలయును .

16 .స్త్రీలు గర్భము దాల్చిన మూడు మాసముల తరువాత, ప్రసవించిన మూడు మాసముల వరకు యోగ విద్య నభ్యసించ రాదు. ఉదయము నడక మాత్రము చేయవలయును.

17 . మనిషికి రెండు ప్రక్కలు అనగా ఎడమ ప్రక్క, కుడి ప్రక్క. అందువల్ల ప్రతి భంగిమను రెండు ప్రక్కలు తప్పక చేయవలయును.

18 . యోగ భంగిమల నభ్యసించు నపుడు, కాళ్ళ నొప్పులు గాని, బెణుకులు గాని జరుగవచ్చును.అలాంటప్పుడు అభ్యసించుట మానరాదు. నెమ్మదిగా సమయము తగ్గించి అభ్యసిస్తే తొందరలో నివారణ యగును

సనాతన ధర్మం

మన ఈ సనాతన ధర్మంలో కొన్ని ముఖ్య విషయాలు

-ఒక పండగ చేసుకోవలసిన తీరులో చేసుకొని ఉన్నతిని పొందవచ్చు, ఒక్క ఏకాదశి, ఒక్క శివరాత్రి చాలు.
-నిరంతరం ఒక స్తుతి చదివుతూ ఉన్నతిని పొందచ్చు, ఏమీ వద్దు కేవల భగవన్నామ స్మరణం చాలు.
-ఎన్ని తప్పులు చేసినా తప్పు తెలుసుకొని సంపూర్ణ ప్రాయశ్చిత్త చిత్తంతో శరణాగతిద్వారా ఉన్నతిని పొందచ్చు, దీన్ని కన్ఫెషన్స్ తో పోల్చడం కన్నా తెలివితక్కువతనం లేదు.
-మరణం తరవాత చేసుకొన్న మంచి, చెడు కర్మలను బట్టి ఊర్థ్వ/అధోలోకాలుంటాయి. అది ఆశచూపడం కాదు అది సనాతన ధర్మ మూల సిద్ధాంతాలలోఒకటైన కర్మ సిద్ధాంతం. దీన్ని ప్రశ్నించేవాడు ఈ ధర్మంలో చరించేవాడే కాదు. అవైదిక మతంలో చరిస్తూ ప్రచారం చేస్య్కొనేవాడికన్నా అసలు వాడే ఈ ధర్మానికి బద్ధవిరోధి కూడా.
-జీవన్ముక్తులు అనే పదం లేదా ఈ పదం అన్వయమయ్యేది సనాతన ధర్మంలోని వారికే, అక్కణ్ణుంచే ఇతర మతాలు అరువెత్తుకెళ్ళాయి. ఇక్కడే ఇప్పుడే బ్రతికుండగానే ఆత్మ స్వరూపుడవు కావచ్చు, సత్యం తెలుసుకొవచ్చు అనేది కేవల సనాతన ధర్మ సిద్ధాంతమే, ఇతరత్రా మనిషి బుద్ధిలోంచి పుట్టినది కాదు.
-తెలిసో తెలియకో మహాత్ములు తిరుగాడిన ప్రదేశాలలోగానీ, ఆశ్రమాలలోగానీ, వారు వసించిన ప్రదేశాలలోగానీ, పుణ్యక్షేత్రాలలోగానీ ఎందుకు తిరిగినా ఎప్పుడు ఎలా తిరిగినా అది కేవల భగవత్సంకల్పం దానివల్లనూ ఉన్నతమైన ఫలితాలుంటాయి, ఒక్క నదీ స్నానం చాలు, ఒక్క తీర్థ నమస్కారం చాలు ఉద్ధరింపబడడానికి. తప్ప అది గొఱ్ఱెలు, పందులు రొచ్చులోపడి తిరిగేలాంటి చందంకాదు.
-హాస్యోక్తులలో భగవన్నామం తలచుకున్నా భగవంతుడుద్ధరిస్తాడు
- ఇంకా ఎన్నో రకాలు, ఒకటి కాదు రెండుకాదు ఎంతమంది ఎలా ఉద్ధరింపబడ్డారో అని తెలుసుకోవడానికి ఎన్నో ఉదాహరణలు కోకొల్లలు
-ఎన్నో ఎన్నో విధాల అందరినీ ఉద్ధరించగలిగే ధర్మం నా సనాతన ధర్మం - సార్వభౌమత్వం ఉన్న ఏకైక ధర్మం 

మానవ దేహం లో ఆరు చక్రములు


మన మానవ దేహం లో ఆరు చక్రములు అమరి వుంటాయి
అవి,,,
(1)మూలాధార చక్రం :- ఒక గడియ నలభయి విగడియలకు ఆరు వేల జపములు జరుగును ఆధార చక్రమునకు పైన రెండుఅంగులములో గుహ్య స్థానమున
(2) స్వాదిష్టాన చక్రం :- పదహారు గడియల నలభయి విగడియలకు ఆరువేల జపములు జరుగును
దీని ముడుఅంగులములలో నాభి నందున
(3)మణిపూరక చక్రం :- దీని పైన పదిఅంగులములలో హృదయము అందున
(4) అనాహత చక్రం :- పదహారు గడియల నలభయి విగడియలకు ఆరువేల హంస జపములు జరుగుతుంది దీని పైన పన్నెండు అంగులములలో కంఠం నందున
(5)విశుద్ధ చక్రం :- రెండు గడియల నలభయి విగడియలకు వేయి హంస జపములు జరుగుతుంది
దీని మొదలు పన్నెండు అంగులములో బ్రుమధ్యమున
(6)ఆగ్నేయ చక్రం :- ఈ చక్రములకు నడి నెత్తిన బ్రహ్మరంధ్రము వుండును
అదియే "సహస్రారము" ఓంకారముతో ద్వనియుస్తూ వుంటుంది.రెండు గడియల ఆరు విగాదియలకు వేయి జపములు జరుగును.

ఏకాగ్రతతో మనసు పై ధ్యానము నిలిపిన ఓంకారము వినిపిస్తుంది
బ్రుమధ్యమున దృష్టి నిలిపిన పరంజ్యోతి కనిపిస్తుంది


"వూపిరి పేరే హంస గా, వుశ్వాస నిశ్వాసల కొలతగా ఓంకార జపము జరుగును"

Friday 24 January 2014

కలి స్వరూపం (షష్ఠాంశము, శ్రీవిష్ణుపురాణము)-శ్రీ విష్ణు పురాణము

మైత్రేయ ఉవాచః

శ్రోతుమిచ్ఛామ్యహం త్వత్తో యథావ దుప సంహృతిమ్‌ |
మహాప్రళయ సంజ్ఞాం చ కల్పాంతే చ మహామునే ||

కల్పాంతమందు జరిగే ప్రాకృత ప్రళయంలో ఆ పరమాత్మ ఈ జీవజాలాన్నంతటినీ ఎలా ఉపసంహరిస్తాడో వినగోరుతూన్నాను - అని మైత్రేయుడు అడిగినపుడు, పరాశరుడిలా చెప్తూన్నాడు...

"బ్రహ్మ కలియుగాంతాన ఈ సృష్టిని ఉపసంహరిస్తాడు. ఋగ్యజుస్సామవేదోక్త ధర్మప్రవృత్తికి హేతువైన సదాచారాలు కలియుగంలో సాగవు. వర్ణాశ్రమ ధర్మాలపట్ల ప్రజలకు నిర్లక్ష్యం ప్రబలుతుంది. వివాహాలు ధర్మబద్ధంగా జరగవు. దాంపత్యక్రమం ఉండదు.

గురుశిష్యులకు ఆత్మీయమైన గురుకుల పద్ధతి సాగదు. అగ్నిహోత్రాలు, దేవతోపాసన బాహ్యాడంబరాలుగా మాత్రమే ఉండి ధర్మానికి తీవ్ర విఘాతాన్ని కలిగిస్తాయి. బలం గలవాడే కలిలో ప్రభువుగా చలామణీ అవుతాడు. కన్యను పెళ్లాడటానికి అన్ని వర్ణాలలోను ధనం - బలం ప్రాముఖ్యత వహిస్తాయి. పాండిత్యంతో యోగ్యులనిపించుకోవాలని ప్రయత్నించడం వృథా ప్రయాస కాగలదు. ఎవరేం చెప్పినా అదే శాస్త్రం! తన బుద్ధిననుసరించి ఎవరేం చేస్తే అదే గొప్ప సత్కార్యం. తనకు తాను మంచిదని భావించే పనిచేసేవాడు మహాయజ్ఞకర్త. సర్వం దేవతలను పైపైన తలచేవారే! అంతటా ఆశ్రమాలే! అందరూ ధార్మిక వచోవేత్తలే! స్త్రీలకు కేశాలే అందంగా తోస్తాయి. వాటిపట్ల శ్రద్ధనే అందం అనుకుంటారు.

'స్త్రీణాం రూపం మదంశ్చైవం కేశై రేవ భవిష్యతి'

సువర్ణం, మణి, రత్న, వస్త్రాది సౌందర్యం లోపిస్తుంది. విత్తవంతుడినేభర్తాగా వరించడానికి స్త్రీలు ఇష్టపడతారు. డబ్బులేనివారికి విడాకులప్రాప్తి తప్పదు.

"పరిత్యక్ష్యంతి భర్తారం విత్తహీనం తథా స్త్రియః | భర్తా భవిష్యతి కలౌ విత్తవానేవ యోషితాం ||"

ఉత్తమ వంశంలో జన్మించడం అనేది పరిపాలకునికి ప్రధమార్హత కానేకాదు. గృహం గలవాడే భోగి. తాను ఎంత గొప్పగా ధనాన్ని అనుభవించగలిగితే అతడే ప్రభువు - ధనవంతుడు - తెలివైనవాడుగా గణనలోకొస్తాడు. స్త్రీలు చిత్రవిచిత్రమైన కోర్కెలకు - పై మెరుగులకు ప్రాముఖ్యమిచ్చి వాటికోసం వెంపర్లాడి వ్యభిచారానికైనా వెనుదీయక తమ కోరికలు తీర్చుకుంటారు. అందరూ అన్యాయార్జిత విత్తానికి ఉబలాటపడతారు.

బ్రాహ్మణాదరణ శూన్యమవుతుంది. వారినీ జనుల్లో ఒకడని తలుస్తారే తప్ప 'భూసురుడ' నిగౌరవించరు. విశిష్ట గౌరవముండదు. ఆవులకు కూడా ఇదే పరిస్థితి. కేవలం పాలుఇచ్చే గుర్తింపు తప్ప, వాటికీ పూజలుండవు.

వర్షాభావ పరిస్థితులవల్ల జనులంతా ఆకలికి అల్లాడుతూ, తాపసులవలె కందమూలాలు తినవలసివస్తుంది. స్నాన ధ్యానాదులు, అగ్నిహోత్ర దేవతారాధన - అతిథి పూజాదికాలు లేకుండానే భోజనం చేస్తూ, ఇవే సుఖ సంతోషాలనుకుంటూ ఉంటారు. ప్రజలు దురాశాపరులై, హ్రస్వదేహులై, (మరుగుజ్జులుగా) దుర్బలులై సేవక వృత్తితో జీవితం గడుపుతారు. దుర్బలుడైనా ధనాఢ్యుడతే బ్రహ్మరథం పడతారు. స్త్రీలు రెండుచేతులా తలలు గోక్కుంటూ, కేశ సౌందర్యమే ముఖ్య మనుకుంటారు. పెద్దల - భర్తల ఆజ్ఞను ధిక్కరిస్తుంటారు. శీలం చెడినవారు అధికులవుతారు. ఉత్తమ కులాలవారు కూడా, నీచపురుషుల పంచన డబ్బుకోసం చేరతారు.

బ్రహ్మచర్యవ్రతాన్ని ఆచరించకుండానే, ఒడుగుచేసుకున్నవారు వేదాల్ని చదువుతారు. గృహస్థులు అగ్నిహోత్రాలు నిర్వర్తించరు. తప్పసిసరిగా చేయవలసిన దానాలు కూడా చేయరు. గ్రామ్యాహారాలు, పాడుతిళ్ళు, పాడుదానాలు పట్టడానికీ సంకోచించరు. సన్యాసులు సైతం ఇంతే!

ఇక - రాజులు రక్షకులుగా గాక, భక్షకులవలె ప్రవర్తించి పన్నులపేరిట దొంగలకంటే హీనంగా ప్రవర్తిస్తారు. ప్రత్యక్ష పన్నులకంటే పరోక్షపన్నులచేత ప్రజల నడ్డి విరుస్తారు.

వైశ్యులు స్వధర్మపాలన అయిన వాణిజ్యం, మారు వర్తకాలు విడిచి వడ్రంగం, కమ్మరి వృత్తి మొదలగు శూద్రవృత్తులు అవలంబిస్తారు. (కొందరు వ్యాపారాల్లో మోసాలకు పాల్పడి, నిందలకు గురౌతారు). శూద్రులు సన్యాస చిహ్నాలు దాల్చి, కాషాయాలు కట్టి ప్రవచనాల వరకే పరిమితమై, నానా అనాచారములు - అకృత్యాలు సల్పుతారు. దుర్భిక్షాలు అధికమవుతాయి. పదేళ్లవయసుకే గర్భోత్పత్తి సామర్థ్యం వచ్చి, కన్యాగర్భాలు హెచ్చుతాయి. పన్నెండేళ్లవయసొచ్చేసరికే జుట్టు నెరిసిపోవడం ప్రారంభమవుతుంది. పాతికేళ్ళకు మించి జనులు బతకడం అసాధ్యం. అల్పమతులవల్ల సంసారాలు విచ్చిన్నమై జారిణులు - స్వైరిణులు అధికం అవుతారు.

ధర్మహాని జరిగే ఈ కలిలో, ధర్మపరులు ఎప్పటికప్పుడు కలిప్రభావాన్ని అంచనా వేస్తుంటారు. విచక్షణులకు కలి చెలరేగడం బోధపడుతూనే ఉంటుంది. మేఘాలు స్వల్పంగా వర్షించడం - పంటలు అల్పమాత్రమై ఫలించడం - ఉత్పాతాలు అధికం కావడం, జనుపనార వంటివి వస్త్రాలుగా చెలామణీ కావడం, పాలు ఆజ్యప్రాయమై రుచిలేక ఉండటం, వట్టివ్రేళ్ళే గంధంగా భావించబడటం...ఇవన్నీ మహాత్మ్యాలే !

నరులకు - మాతాపితృ గురు బాంధవులకంటే, భార్య - భార్యవైపున వారు అధిక ప్రీతికరమైన వారవుతారు. సత్య - శౌచాలు అంతరిస్తాయి. స్వాధ్యాయ వషట్కారాలు వినిపించవు. కలిలో స్వల్ప ప్రయత్నం చేత సంపాదించిన పుణ్యమే, కృతయుగంలో వేలఏళ్లు తపస్సు చేసి సంపాదించిన పుణ్యంతో తూగునట్లు చెప్పుకుంటారు. దీనిపై మహాజ్ఞాని వ్యాసుడోశారి గంగలో నీటమునిగే సందర్భంలో చేసిన వ్యాఖ్యాలిక్కడ చెప్పుకోవలసి వున్నది.

కలిలో ధర్మసూక్ష్మం

త్రేతాయుగంలో పదేళ్ళు చేసిన పుణ్యం - ద్వాపరంలో నెలరోజులు చేసిన పుణ్యాలకు, కలిలో ఒక ఏడు - ఒక రోజు చేసిన పుణ్యంతో సమానం. జపం - తపం - బ్రహ్మచర్యవ్రతాలకు ఇదీ ఫలితం. అందువల్లనే కలి 'బాగుంది' అన్నాడు. ఆ నదిలో ఒక మునక వేసిన వ్యాసుడు. తర్వాత - అల్పశ్రమచేత బాగా ధనాన్ని సంపాదించే అవకాశాలు కలిలో అధికం. బ్రాహ్మణులు సైతం వ్యర్థప్రసంగాలు - వృథా ఆచరణలు - సంతర్పణలు చేసి పతితులౌతారు. పరాధీనతవల్లనే వారికీపాట్లు. కనుక వీరికి క్లేశం తప్పదు.

బ్రాహ్మణులకంటె అధికంగా యజ్ఞాలపట్ల శ్రద్ధవహించి శూద్రులు పుణ్యలోకాల్ని గెలిచి ధన్యులవుతారు. అందువల్ల 'బాగుబాగు' అని రెండోమునక వేస్తూ అన్నాడు వ్యాసుడు.

పతిసేవ త్రికరణశుద్ధిగా ఆచరించే ఉత్తమ ఇల్లాళ్ల కొరత కలిలో అధికం. ఎంతో శ్రమించి పురుషుడు పుణ్యం చేస్తే, ఒకవైపు తాను జారచోరస్వైర విహారాలు చేస్తూనే స్త్రీ ఆ పుణ్యంలో భాగం పొందడం 'మహాబాగుబాగు' అని మూడవ మునకవేస్తూ అన్నాడు వ్యాసుడు.

తాను నీట మునకలు వేస్తూ భవిష్యద్దర్శనం చేస్తూ మునక కొకటి చొప్పున పైవిధంగా ప్రశంసిస్తున్నది ఎవరినో తెలీక, అక్కడకు చేరిన ఋషులకు సందేహనివృత్తి చేశాడు వ్యాసుడు. వారీ విషయాన్నే అడగాలని అక్కడకురాగా, దివ్యదృష్టితో అది గ్రహించిన వ్యాసుడు వారు అడగకముందే, తన వచనాలకు తానే ముందుగా భాష్యం చెప్పేసరికి ఆ ఋషులంతా ఆశ్చర్యపోయారు.

"అవును మహాత్ములారా! ఇంకేం చేయమంటారు? కృతాది యుగాల్లో ధర్మసంపాదన నిమిత్తం ద్విజులకు అధికశ్రమ ఉన్నది. కలిలో ఈ శ్రమ చాలా తగ్గింది. ఇంకేం చెప్పమంటారు"? అని వ్యాసుడన్నాడు. ఋషులు వ్యాసమహర్షిని ప్రశంసించి వెళ్ళారు. ఇదీ కలియుగ ధర్మసూక్ష్మం.

మైత్రేయా! సర్వభూత ప్రపంచానికీ మూడు విధాల ప్రళయం ఉంటుంది. 1. నైమిత్తికం. 2. ప్రాకృతం, 3. అత్యంతికం. ఇందులో మూడోవది మోక్షము. చతుర్దశ మన్వంతరాల చివర వచ్చే లయమే నైమిత్తిక ప్రళయం. (దేవతల కాలమానం ప్రకారం..)

వెయ్యి చతుర్యుగములు (బ్రహ్మకల్పమున) ముగిశాక భూమండలం క్షీణప్రాయం కాగలదు. నూరేళ్లకాలంపాటు భయంకరమైన అనావృష్టి ఏర్పడుతుంది. అల్ప సత్త్వం గల పార్థివ జీవులన్నీనశిస్తాయి.

విష్ణుభగవానుడు రుద్రరూపుడై ఇతర జీవజాలాన్ని కూడా హరించడం ప్రారంభిస్తాడు. సూర్యకిరణాలు తీక్షణమై జలవనరుల్లోని నీటినేగాక, ప్రాణమున్న జీవజాలంలోని నీటినీ శోషింపచేయడం వల్ల, ఎక్కడా చుక్క నీరు ఉండదు. ఏడు సూర్యకిరణాలే ఏడుగురు సూర్యుల్లా ప్రకాశించడం చేత, మొత్తం భూమి తాబేటి డిప్పవలె నీరింకిపోయి ఘనీభవించిపోతుంది.

అప్పుడా ప్రళయకాలాగ్ని రుద్రుడు సర్వహరుడై, శేషుని నిశ్వాసాల్లోంచి మొదట పాతాళం అడుగునుంచి కాల్చడం ప్రారంభిస్తాడు. ఆపైన భూమ్మీదకొచ్చి సర్వం దహించేస్తాడు. అటుపైన వరుసగా అంతరిక్షం - ఆ పైలోకాలకు వ్యాపించి తన జ్వాలకీలాగ్రముచేత కమ్ముకొని, కాలుతూన్న అంబరీషమా అన్నట్లుంటాడు.

మూడులోకాల వాసులూ వేడికి మాడిపోతారు. ఇంకొక దశలో శ్రీమహావిష్ణువు ఇట్లే సర్వజగత్తులను దహించి తన ముఖ నిశ్వాసములచేత (బైటికి ఊపిరిని దీర్ఘంగా వదలుట) ఘోరమైన సంవర్తకాలనే మేఘాల్ని సృష్టిస్తాడు. ఏనుగుల్ని పోలిన, ఉరుములు - మెరుపులతో కూడిన ఆ మేఘాలు వివిధవర్ణాలతో, వివిధ ఆకృతులతో ఆకాశాన్ని నింపి అతి భయంకరంగా అగ్నిని వర్షిస్తూ త్రిజగత్తులలో చెలరేగిన కాలాగ్నిని మించిపోతుంది.

ఆపైన నిర్విరామంగా వర్షం కురిసి, అగ్ని ఆరిపోయి క్రమంగా ఉదకం చేత లోకత్రయము నిండిపోతుంది. లోకాలు అంధకారబంధురమై, చరాచర భౌతిక ప్రపంచమంతా నశించిపోయేలా నూరేళ్ళు అలాగే వర్షిస్తుంది. ఇది అంతా ఆ పరమాత్మ లీల.

Monday 20 January 2014

గుడిలో శఠగోపం తలమీద పెట్టడం ద్వారా ఫలితం ?

శడగోప్యం అంటే అత్యంత గోప్యామైనది అని అర్థం. శఠగోపంను వెండి , రాగి, కంచుతో తయారు చేస్తారు. దాని మీద విష్ణువు పాదాలుంటాయి. అంటే మనము కోరికలను భగవంతుడికి ఇక్కడే తెలపాలన్నమాట. పూజారికి కూడా వినిపించకుండా మన కోర్కెలను భగవంతునికి విన్నవించుకోవాలి. అంటే మన కోరికే శడగోప్యము. అది మన నెత్తిన పెట్టగానే ఏదో తెలియని అనుభూతి కలిగి మానసిక ఉల్లాసం కలుగుతుంది. దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, షడగోప్యం తప్పక తీసుకోవాలి. చాలమంది దేవుడ్ని దర్శనం చేసుకున్నాక వచ్చినపనైపోయిందని చక, చకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు. కొద్దిమంది మాత్రమే ఆగి, షడగోప్యం పెట్టించుకుంటారు. మానవునికి శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలూస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్థం.

సహజంగా చిల్లర లేకపోవటం వల్ల, షడగోప్యమును వక్కోసారి వదిలేస్తుంటాము. ప్రక్కగా వచ్చేస్తాము. అలా చెయ్యొద్దు. పూజారి చేత షడగోప్యము పెట్టించుకోండి. మనసులోని కోరికను స్మరించుకోండి. షడగోప్యమును రాగి, కంచు, వెండిలతో తయారు చేస్తారు. పైన విష్ణు పాదాలుంటాయి. షడగోప్యమును తలమీద ఉంచినపుడు శరీరంలో ఉన్న విద్యుత్, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్ బైటికెళుతుంది. తద్వార శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి. షడగోప్యమును శఠగోపనం అని కూడా అంటారు.

Sunday 19 January 2014

గుడిలో ప్రదక్షణం ఎందుకు చేయాలి ?

"ప్రదక్షిణం " లో
ప్ర -- పాపాలకి నాశనము.
ద -- కోరికలు తీర్చమని.
క్షి -- ఉత్తర (వచ్చే) జన్మలో మంచి జన్మ ఇవ్వమని.
ణ -- అజ్ఞానము తొలగించి ఆత్మజ్ఞానం ఇవ్వమని.

ఆలయంలో భగవంతుని చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్ధం ఉంది. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీపరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలితం పొందాడు. అందుకే భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ  విశ్వప్రదక్షిణ అవుతుందని, ఆత్మ ప్రదక్షిణ అవుతుందని అంటారు. ఓ భగవంతుడా నేను అన్నివైపుల నిన్నే స్మరిస్తున్నాను నిన్నే ధ్యానిస్తున్నాను అని అర్ధం. ఏ భగవంతుని ఆలయం లోకి వెళ్తే ఆ భగవంతుని పంచాక్షరి మంత్రం జపిస్తూ ప్రదక్షిణం చేయాలి. ఆ మంత్రం తెలియకపోతే "ఓం" కార జపం చేస్తూ ప్రదక్షిణం చేయాలి.  

దేవుని దగ్గర కొబ్బరికాయలను ఎందుకు కొట్టాలి

సర్వదేవతలను పూజించే సమయాలలోను, యజ్ఞ, యాగములలోను, హోమములయందు, కొన్ని శుభకార్యములలోను, కొబ్బరికాయను కొట్టడం తప్పని సరి. కొబ్బరికాయ పైనున్న పెంకు అహంకారానికి ప్రతీక. మనం మన అహంకారాన్ని విడనాడుతున్నాము అని చెప్పడానికి భగవంతుని ముందు కొబ్బరికాయను కొడతాము. లోపలున్నతెల్ల  కొబ్బరిలా మన మనసును సంపూర్ణంగా భగవంతుని ముందు పరిచామని దాని ద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా మన జీవితాలు ఉంచమని ఆ భగవంతుని ప్రార్దిస్తున్నాము అని అర్ధం. సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికా మాత్రమే.
కొబ్బరికాయ అంటే మానవ శరీరం. బొండం పైనున్న చర్మం మన చర్మం. పీచు మనలోని మాంసము, పెంకు ఎముకగా, కొబ్బరే ధాతువు, అందులోని కొబ్బరి నీరు మన ప్రాణాధారం, కాయ పైనున్న మూడు కళ్ళు ఇడ, పింగళి, సుషుమ్న అనే నాడులు..  

మానవధర్మాలు

మనిషిని జీవింపచేసేవి -- నిగ్రహము, ప్రేమ, తృప్తి, త్యాగము.
మనిషిని భాద పెట్టి దహించేవి -- అసూయ, అత్యాశ, ద్వేషం, పగ.
జీవితానికి కీడు చేసేవి -- అహంకారం, అధికారం, అనాలోచన, నేను అనే అత్యాశ.
జీవితంలో ఆశించకుడనివి -- అప్పు, యాచన.
జీవితంలో చేయకుడనివి -- వంచన, దూషణ.
విద్య నేర్పే గురువుకు కావలసినవి -- ఓర్పు, నమ్మకం, దైవభక్తి, ఔదార్యం.
శిష్యుడికి కావలసినవి --  లక్ష్యం, సహనం, గురువుపై నమ్మకం, వినయం, విధేయత
పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేవి -- వ్యామోహం, స్వార్ధం.
వెళ్ళకూడని మార్గాలు -- ఒంటరితనం, అవినీతి, అధర్మం.
ఆచరించి బోదించదగినవి -- నీతులు, సుద్దులు.
నిత్యమూ ఆచరించదగినవి -- ధర్మమూ, దయా, దాక్షణ్యము.
నిత్యమూ ఆలోచింపదగినవి -- సద్భావము, సమాజము, సమైక్యత.
నియమంగా పాటించవలసినవి -- కరుణా, క్రమశిక్షణ, సమయపాలన.
పూజింపదగినవారు  -- తల్లి, తండ్రి, గురువు, దైవం, పరస్త్రీ.
నిత్యం చేయవలసిన ఆరాధనలు -- సత్యవ్రతము, మౌనవ్రతము.
నిత్యం మనం ఎవరిని ఆదుకొనవలయును -- దీనులను, ఆపన్నులను.
 చేయకూడని పనులు -- చోరత్వము, వ్యబిచారము.
పలుక కూడని మాటలు -- అశ్లీల పలుకులు, అశుభములు.
నిత్యమూ కోరుకోవలసినవి -- అందరిక్షేమం.
పనికిరాని పనులు -- పరనింద, పరవిమర్శన.
చేసుకోవలసినవి -- ఆత్మవిమర్శ, ఆత్మరక్షణ.
వదులుకొవలిసినవి -- ఆర్భాటం, ఆడంభరం, స్వోత్కర్ష.
కాపాడుకోవలిసినవి -- ఆత్మాభిమానం, శీలం.
నేర్చుకున్నది -- ఆవగింజంత.
నేర్చుకోవలిసినవి -- ఆకాశమంత.
దైవద్యానానికి ఉండకూడనివి -- కోపం, చింత, వాంఛ, అపనమ్మకం.
ఎదుటవారిని చేయకూడనివి -- ఆశ పెట్టుట, అవమానపరచుట.
నమ్మకూడనివారు -- అసత్యవాదులు.
నమ్మదగిన వారు -- తల్లి, దైవం.
పట్టి పీడించేవి -- అనుమానం, అపనమ్మకం.
కష్టాలను తొలగించేవి -- విజ్ఞానం, వివేకం.
మర్చిపోకుండా చేయవలసినవి -- పరోపకారం, దైవచింతన.
ఉండవలసిన విధానం -- ఆలోచన తక్కువ, ఆచరణ ఎక్కువ.
భుజింపవలసినది -- మితాహరం(తక్కువ భోజనం).
అభివృద్ధి పొందలేకపోవడానికి కారణం -- అలసత్వం, అలక్ష్యం, సమయపాలన లేకపోవడం, చిరునవ్వు లేకపోవడం.
నేర్చుకోవలిసిన నీతి -- మంచిని చూడు, మంచిగా మాట్లాడు, మంచి విను, మంచి వారితో స్నేహం చేయు.
ఉన్నతుడికి కావలసినవి -- భయం లేకపోవడం, భాద్యతగా వ్యవహరించడం, అందరికి భద్రత ఇవ్వడం.

లక్ష్మీదేవి నివాసము ఉండు ప్రదేశములు

సత్యవంతులయందును, దైవభక్తులయందును, సలక్షణమైన గృహములయందును, వీరుల ధైర్యముయందును, జయ ధ్వజములయందును, ఏనుగులయందును, గోవులయందును, ఛాత్ర చామరములయందును, తామర పువ్వులయందును, పంట భూములయందును, పసి పాపల నవ్వులయందును, పూతోటలయందును, రత్నములయందును, దీపములయందును, అద్దములు మొదలయగు మంగళ వస్తువుల యందును సౌభగ్యలక్ష్మి నివసించునని లక్ష్మి నారదునితో పలికేనని వ్యాసమహర్షి విష్ణు పురాణమలో తెలిపెను.  

ఈశ్వర పూజకు మారేడు దళాలు ఎందుకు?

“ఏకబిల్వం శివార్పణం” అని మారేడు దాళలలతో శివుని పూజిస్తారు.
మూడు దళములు కలపి ఒక్క అండముగా పిలవబడును కావున, దీనికి బిల్వము అని పేరు వచ్చింది. ఈ మూడు రేకులకు ఆధ్యాత్మికంగా,

"పూజకుడు -పూజ్యము -పూజ",
"స్తోత్రము -స్తుత్యము - స్తుతి",
"జ్ఞాత -జ్ఞేయము -జ్ఞానము"

అని అర్థాలు చెప్పు చున్నారు. ఈ విధంగా (3×3) మూడు, మూడును వేర్వేరుగా భావించుటయే త్రిపుటిజ్ఞానము, ఇదియే అజ్ఞానము, వేరువేరుగా కనిపించినను, ఆధారకాండము ఒక్కటే అయినట్లు, “ఓ మహాదేవా!” సృష్టి, స్థితి, లయ కారకుడవైన నీవే “మారేడుదళము” నందు మూడు పత్రములుగా వేరువేరుగా వున్నట్లు తోచుచున్నావు.

“పూజ చేయువాడవు నీవే, పూజింపబడునది నీవే, పూజాక్రియవు నీవే” - అనే భావంతో అభేదబుద్ధితో పూజించుటయే సరియైన పద్ధతి, మరియు పుణ్యఫల ప్రదము. ఈ విధమైన భావముతో పూజించకుండుటయే అజ్ఞానము మరియు పాపహేతువు. ఈ జ్ఞానరహస్యమును తెలుసుకుని - బిల్వపత్రరూపముతో “త్రిపుటి జ్ఞానమును” నీ పాదములచెంత నేను సమర్పించుచున్నాను. ‘శివోహం - శివోహం ‘ అను మహావాక్య జ్ఞానమును, స్థిరపర్చునదియే బిల్వార్చనయగును.

మహా మృత్యుంజయ మంత్రం

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం |
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ ||

తాత్పర్యం: అందరికి శక్తి నొసగే ముక్కంటి దేవుడు, సుగంధ భరితుడు అయిన పరమ శివుని నేను (మేము) పూజించు చున్నాము. ఆయన దోస పండును తొడిమ నుండి వేరు చేసినటుల (అంత సునాయాసముగా లేక తేలికగా) నన్ను (మమ్ము) అమరత్వము కొరకు మృత్యు బంధనము నుండి విడిపించు గాక!

మనకు ఉన్న, తెలిసిన మంత్రాలలో గాయత్రి మంత్రం వలె ఈ "మహా మృత్యుంజయ మంత్రం" పరమ పవిత్రమైనది, అతి ప్రాచుర్యమైనది. క్షీర సాగర మథనం లో జనించిన హాలాహలాన్ని రుద్రుడు లేదా పరమ శివుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు. ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులగుదురు అని పలువురి నమ్మకం. ఇది ఒక విధమైన మృత-సంజీవని మంత్రం అని చెప్ప వచ్చు. అంతేకాక ఆపదలు కలిగినపుడు కూడా దీనిని చదువుకో వచ్చును. సాధారణంగా ముమ్మారు గాని, తొమ్మిది మార్లు గాని, లేదా త్రిగుణమైన సంఖ్య లెక్ఖన దీనిని పారాయణం చేస్తారు.

Saturday 18 January 2014

రాగి పాత్రలలోని ఆరోగ్యం :

మనం నీరు త్రాగేముందు ఈ మధ్యకాలంలో ఏవేవో యంత్రాల ద్వార శుద్ధి చేసిన మినరల్ వాటర్ ని కొని అవే మంచివి అని లీటర్ 4రూపాయల నుండి 5 రూపాయలు పెట్టి కొంటున్నాం. కొన్ని పెద్ద వ్యాపార సంస్థలు లీటర్ డబ్బా 20/- అమ్ముతున్నారు. కాని వాటిలో స్వచ్చత ఉందా అనే సందేహం చాలామందిలో ఉంది. కాని ఈ మధ్య చేసిన సర్వేలలో తేలిన విషయం ఏమంటే నీళ్ళలో ఒక కెమికల్ కలిపి వాటిని మినరల్ వాటర్ లా అమ్ముతున్నారు. దీనివలన ప్రమాదమే కాని ఉపయోగం లేదు. రోగాలని కొనుక్కొని తెచ్చుకుంటున్నాము. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే ఆరోగ్యం కోసం అంటారు అందరు. రోగాల బారిన పడకూడదు అనుకుంటూనే రోగాలని కొనుకుంటున్నాము. ఇంకో విషయం ఏంటంటే బయట మార్కెట్ లో కొనే మినరల్ వాటర్ వలన మన శరీరంలో ఎముకల చుట్టూ ఉండే కాల్షియం కరిగిపోయి ఎముకలు డొల్ల అవుతున్నాయి. దీనివలన ఎముక పటుత్వం కోల్పోయి చిన్న చిన్న సంఘటనలకే విరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే!

భారతదేశంలో ఉన్న మన పూర్వికులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మన ఆరోగ్యం కోసం కొన్ని సూత్రాలు చెప్పారు. అందులో ఇది ఒకటి. నీటిని శుబ్రపరిచేందుకు రాగి, ఇత్తడి బిందెలు, చెంబులు వాడేవారు. వీటిని వాడటం వలన నీటిలో ఉండే సూక్ష్మక్రిములు చనిపోతాయి.

ఈమధ్య జరిగిన ఒక ప్రయోగంలో ''రోబ్ రీడ్'' అనే శాస్త్రవేత్త ప్లాస్టిక్ పాత్రలు, మట్టి పాత్రలు, ఇత్తడి, రాగి పాత్రలలో విరోచనకారి అయిన ఒక సూక్ష్మక్రిమిని వేశారు. దీనిని 24గంటల తరువాత పరిశీలించగా ఇత్తడి రాగి పాత్రలలో వేసిన క్రిములు శాతం తగ్గింది. మరల 48 గంటల తరువాత పరిశీలించగా రాగి మరియు ఇత్తడి పాత్రలలో క్రిములు 99శతం నశించిపోయాయి. కాని ప్లాస్టిక్, పాత్రలలో వేసిన క్రిమి 24గంటలకి రెట్టింపు అయింది. 48 గంటలకి దానికి రెట్టింపు అయింది. అని కనుగొన్నారు.

ఈమధ్య కాలంలో అనేక బహుళ అంతస్తుల హోటల్స్ లో రాగి పాత్రలని వాడటం గమనార్హం. ఎందుకంటే వారి కష్టమర్స్ ఆరోగ్యం వారికి ముఖ్యం కదా.

కనుక రాగి, ఇత్తడి పాత్రలను వాడండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

కామాన్ని జయించడం ఎలా?

కామం అంటే ఏమిటి? దీనిని మనం ఎందుకు జయించాలి? దీన్ని జయించడం వలన మనకు కలిగే ప్రయోజనాలేంటి? మొదట కామం అంటే ఏమిటో తెలుసుకుందాం. కామం అనగానే చాలా మందికి చాలా భావనలు ఉంటాయి. ఇంకా కొందరు ఏవేవో కూడా ఊహించుకుంటారు.అసలు కామం అంటే కోరిక అని మాత్రమే అర్థం. అంటే మన మనసులో కావాలి అని కలిగే ప్రతిదీ కూడ కోరికే. అంటే ఉదాహరునకు మంచి ఉద్యోగం, మంచి భార్య, మంచి భర్త, బాగా సంపాదించాలి ఇలా ప్రతిదీ కోరికే అంతేగాక మీరు ఊహించుకునే ఏవేవో భావనలు అన్నీ కూడా అందులో ఒకే ఒక భాగం మాత్రమే అంతే తప్ప కామం అంటే ఏవేవో కాదు. సరే ఈ కోరికలు వుండడం వలన ఏమవుతుంది? ఎవరికైనా పుట్టిన ప్రతి మనిషికి కోరికలు వుండడం సహజం కదా. కోరికలు ఉంటే ఏమవుతుంది. మనకు కావలసినవి అన్నీ కావాలి కదా మరి? లేకపోతే ఎలా బ్రతికేది అని చాలా మందికి సందేహం కూడ వుంటుంది. అవును కదండీ మరి. కోరికలు వుండాలి కాని దానికి ఒక పరిమితి ఉండాలి. అంతే కాని అత్యాస ఉండకూడదు. కాని ఇక్కడ వచ్చిన ఒక చిక్కు సమస్య అంత ఏమిటంటే కామాన్ని జయిస్తే గాని మనం ఆధ్యాత్మికంగా ముందుకు అడుగువేయలేము. ఆ విధంగా ఆలోచిస్తే దీనిని జయించడమే మేలు అని అనిపిస్తుంది.

స్వామి వివేకానంద

కేవలం ముప్ఫై తొమ్మిదేళ్ళు భూమిపై తిరుగాడినప్పటికీ, నేటికీ సజీవ చైతన్యమూర్తిగా స్ఫూర్తినిస్తున్న వ్యక్తిత్వం ఆ మహాశయునిది. భారతదేశపు హృదయం స్వామీ వివేకానంద. 1893 లో విదేశాలకు భారతీయ వైభవాన్ని తెలియజెప్పడమే కాక,భారతీయులకు స్వాభిమానాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ, దేశభక్తినీ కలిగించిన మహాత్ములాయన. వారి వాక్కు వ్యక్తిత్వం నిజమైన స్వాతంత్ర్యోద్యమాలకు స్ఫూర్తినిచ్చింది. వారు భారతదేశపు మహోజ్జ్వల గతచరిత్రనీ, పరాయిదాడులచే తేజస్సు తరిగిన తన కాలపునాటి వర్తమానాన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు. శాస్త్రాలను చదివి, గురువుద్వారా అనుభవజ్ఞానాన్ని పొంది, దేశవిదేశాలను పరిశీలనాత్మక దృష్టితో పర్యటించి - అన్నిటినీ అవగాహన చేసుకొని, అద్భుతమైన బోధనలను అందించారు.
మాటలతో పరిమితం కాకుండా ఆ రోజుల్లోనే దేశంపట్ల బాధ్యతాయుతమైన గౌరవాన్ని ప్రకటిస్తూ సేవనందించారు. దేశం సాంకేతికంగా, వైజ్ఞానికంగా ఎదగాల్సిన అవసరాన్ని గుర్తించి, దానికిగానూ ఎందరికో స్ఫూర్తినిచ్చారు.
భౌతికంగా, బౌద్ధికంగా దేశం ఎదగాలి - అని ఆశించారు. అది ఆశయంగా మాత్రమే మిగలకుండా, ఏవిధంగా ఆచరణలోకి తేవాలో ప్రణాళికాబద్ధంగా నిర్దేశించారు. ఈ దేశ పునర్నిర్మాణంలో - దీని స్వాభావిక ఆర్షసంస్కృతి, ధార్మిక స్ఫూర్తి పునాదులని ప్రగాఢంగా భావించి విశదపరచారు. ’హిందూమతం’ అని చెప్పబడుతున్న ఈ దేశపు స్వాభావిక (Native) ప్రాచీన జీవన విధానం, విజ్ఞాన కళాసంపత్తి, ఆదర్శాలు ఏమరకుండా, వాటి ఆధారంగానే దేశపురోగతిని సాధించగలము. - అని సహేతుకంగా తేటపరిచారు.
అప్పటికి కొద్ది శతాబ్దాలుగా బహుసంఖ్యాక ప్రజలు, స్త్రీలు వెనుకబడి ఉన్నారని గమనించి, వారిని నిర్లక్ష్య పరచరాదని, దేశాభ్యుదయం వారికి చేరి దేశప్రగతిలో వారు ప్రధానం కావాలని ప్రబోధించారు. "మనలో సంస్కరించుకోవలసిన అంశాలు ఉన్నమాట వాస్తవమే. ఆస్థితి ప్రతి దేశానికీ, ప్రతి సమాజానికీ ఉంటుంది. ఆమాటకొస్తే - మనదేశం, మిగిలిన వాటితో పోలిస్తే చాలా మెరుగైనది..." అని చెప్పిన ఆ మహానుభావులు దేశసమగ్రాభివృద్ధికోసం, నాటి పరాయిపాలనలోనే, దీర్థదృష్టితో అత్యద్భుతమైన, ఆచరణసాధ్యమైన సూచనలు చేశారు. విభాగాలపై కాకుండా సమగ్రతపైనే వారి దృష్టి. ఇప్పుడు దేశానికి ఇది అత్యావశ్యకం.
విచారకరమైన విషయమేమిటంటే - స్వాతంత్ర్య సిద్ధి కాలంలోనూ, అటుపై ఇన్ని పదుల ఏళ్ళలోనూ ఆ మహనీయుని ఆదర్శాలను పరిగణించని పాలనా పద్ధతులే నడుస్తున్నాయి. రాక్షస రాజకీయ కాలుష్య ప్రభావం చేత ఈ దేశపు భవ్యాదర్శాలన్నీ మంటగలుస్తున్నాయి. విదేశీ మత విస్తరణ వాదుల దుర్మార్గం వల్ల ఈ దేశం సమైక్యస్థితిని సాధించే బదులు, మరిన్ని క్చీలికలకు గురౌతోంది. కులవైషమ్యాలు పెచ్చుపెరిగి, జాతీయభావాలని దెబ్బతీస్తున్నాయి. ఈదేశ ధర్మాలపై, సంస్కృతిపై అవగాహన లేనివారు, తమ పదవులకోసం ఈ ధర్మసంస్కృతిని దెబ్బతీస్తున్నారు. పాశ్చాత్యపాలనలో లేని దిగజారుడునం ఇప్పుడు దేశమంతా కనిపిస్తోంది.
స్వాతంత్ర్య సిద్ధినుండి చట్టాలు, మనుషులు కూడా అగ్ర, అడుగు వర్గాలకోసం ఎన్నో ఆసరాలను కల్పిస్తూ, ఎదగనిస్తున్నా - విదేశీ మత స్వార్థపరులవల్ల, ఓట్లకోసం దేనికైనా తెగిస్తున్న పాలకులవల్ల ’అణిచివేయబడిన వర్గం’ అలాగే ఎదుగూ బొదుగూ లేకుండా ఉంది. మరోవైపు దేశవాసులు, సంస్కృతిప్రియులు మొదటినుండి సమైక్యత కోసం శ్రమిస్తుంటే దానిని కుదరనివ్వకుండా విభేదాలను కొనసాగిస్తూ పరస్పర విద్వేష వైషమ్యాలను సృష్టిస్తున్నారు రాజకీయులు. ప్రజల్లో స్ఫూర్తి సన్నగిల్లుతోంది. ఒక స్తబ్ధత, ఉదాసీనత, వ్యామోహం, సుఖలాలస పెరిగాయి. వివేకానంద మార్గానికి విరుద్ధమైన మతాంతరీకరణలు దేశసమగ్రతను దెబ్బతీస్తున్నాయి.
ఇలాంటి దశలో ఈ వివేకానంద జయన్త్యుత్సవాలువచ్చాయి. దీనిని ఆలంబనగా తీసుకొని వ్యక్తిత్వ నిర్మాణాన్ని సాధించే విద్య, శ్రేయస్కర పాలన, సామాజికాభివృద్ధి, సాంకేతిక ప్రగతి, సమత్వం - వాటిని ఈ దేశపు సనాతన ధార్మిక విలువల ఆధారంగా ఏ విధంగా సాధించాలి?...అనే అంశంపై దేశీయులంతా ఆలోచించాలి.
"మరో 1500 ఏళ్ళకు సరిపడే ఆహారాన్ని అందించాను" అన్న వివేకానంద వాక్కుప్రకారం దేశ పునర్నిర్మాణానికి కావలసిన పాఠాలన్నీ వారి వాక్కుల్లో మనకు దొరుకుతాయి. వాటిని అందిపుచ్చుకొని ఆ యతిరాట్టు నిర్దేశించిన అద్భుత భారతిని ఆవిష్కరించేందుకై అందరం కృషి చేద్దాం.

ఆత్మ అంటే

ఆత్మ అంటే ఏమిటో చాలా మందికి అసలు తెలియదు. దాదాపు ఈ భూ ప్రపంచం మీద పుట్టిన వారిలో 99% మందికి తెలియదు. దాదాపు చాలా మందికి ఆత్మ అంటే తెలుసు అంటారు. అది ఏమిటి అంటే కొందరు దయ్యమని మరికొందరు భూతమని ఇలా దానికి లేని రూపాలను దానికి లేని తొకలను తగిలిచ్చి నిజమైన ఆత్మ స్వరూపాన్ని ఆత్మ యొక్క అర్ధాన్ని చివరకు ఒక వ్యర్ధ పదంగా మారుస్తున్నారు. తెలియకపోతే తెలియనట్లుండాలి, అంతే కాని ఎవడో ఒక తెలివితక్కువ వెధవ వాడికి తెలిసిన ఒక అజ్ఞాన మాటను పట్టుకొని అందరికి అదే దాని అసలు స్వరూపం అని చెప్పడం సబబుకాదు.ఇంకో విషయం ఏమిటంటే ఈ ఆత్మ అనే పదాన్ని, పుట్టిన ప్రతి ఒక్కరు వారి నోటి నుండి ఉచ్చరించి ఉంటారు. అజ్ఞానులైతే, వారు నిర్మానుష్యమైన రాత్రి సమయాలలో మనసులల్లో భయాలు కలిగినప్పుడు, అప్పుడు చనిపోయిన వాళ్ళు ఇక్కడే ఆత్మలై తిరుగుతుంటారు అని భావించుకొనినప్పుడు వారి మనసులో ఈ పదాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటారు, కాని ఇది అజ్ఞానంతో ఆలోచించడం. మరి కొందరు సద్గురువుల దగ్గర బోధన తీసుకోవడం వలన లేక వేదవేదాంగాలను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవడం వలన, అప్పుడు ఈ ఆత్మ అనే పదాన్ని వినని మరియు చదవని వారు ఉండరు. వారికి మాత్రమే ఈ ఆత్మ స్వరూపం గురించి కొద్దిగా తెలిసి ఉంటుంది. ఈ విషయాన్ని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా చెప్పాడు “ఎవరో ఒక మహాపురషుడు మాత్రమే ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరియొక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును.వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును.ఆ విన్నవారిలో, చూచినవరిలో, చెప్పినవారిలో కూడా కొందరు దీనిని గూర్చి పూర్తిగా యెరుగరు. (2:29) “

సరే కాని, నిజానికి ఆత్మ అంటే దైవమా? లేక దయ్యమా? ఇది తెలియాలి, మరీ ముఖ్యంగా అందరూ తెలుసుకోవాలి. అసలు ఈ ఆత్మ అంటే ఏమిటి అన్న విషయాన్నీ మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఈ ఆత్మ అనే పదాన్ని ప్రతి మత గ్రంధంలో లిఖించబడింది, ఈ ఆత్మ అన్న పదం లేకుండా ఉన్న మత గ్రంధమే లేదు, కాని సరిగా దాని అంతరార్ధాన్ని తెలుసుకోలేక సమతమవుతూ దాని అర్ధాన్ని సరిగా గ్రహింపలేక దానికి నానార్ధాలు చెబుతూ చాలామంది వారు confuse అవడమే కాక అందరిని confusion లోకి నెట్టేస్తున్నారు.

ఈ ఆత్మ అంటే నిజానకి ఎవరికీ నిజంగానే తెలియదు. దీనిని వారి హృదయాలలో సాక్షాత్కరించుకున్న వాళ్ళకు మాత్రమె అది ఏమిటో దాని తత్వమూ ఏమిటో అసలు ఈ సృష్టికి మూల కారణమైన శక్తి ఏమిటో తెలుసు అంతే తప్ప మత గ్రంధాలలోని సూక్ష్మమైన రహస్యాలను సైతం బోధించేవాల్లకు కూడ అది ఎలా ఉంటుందో తెలియదు. చూసిన వారు చెప్పిన దానిని, చూడని వారు కొద్దిగా దానిని అవగతం చేసుకొని తెలుసుకుంటున్నారు. ఇదే విషయాన్ని ముండకోపనిషత్తులో ఈ విధంగా తెలిపారు “గొప్ప ఉపన్యాసాలు ఇవ్వడంచేతగాని, చాల శాస్త్రాల అధ్యయనం చేయడంవలనగాని, ఎన్నో గుడార్థాలు మహాత్ములవద్ద వినడం వలన గాని అత్మప్రాప్తి జరుగదు. ఆ ఆత్మకోసం హృదయపూర్వకంగా ఆరాటపడి మనన నిధి ధ్యాసలు చేసే వ్యక్తికే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. అట్టి వ్యక్తికే ఆత్మ తన స్వరూపాన్ని వెల్లడిస్తుంది. ఆత్మ మనోబలం లేనివారికి, అజాగ్రత్తపరులకు, శాస్త్రవిరుద్దమైన తపస్సులు చేసేవారికి లభించదు. అయితే ధృడంగా శ్రద్ధ వుంచి తగిన విధంగా ప్రయత్నించే వారి ఆత్మ బ్రహ్మ పదంతో ఐక్యం పొందగలదు.”

ఒకసారి ఈ ఆత్మ గురించి మత గ్రంధాలు ఏమి బోధించాయో కూడ తెలుసుకుందాం.
భగవద్గీత : శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు ఆత్మ విషయమై ఈ విధంగా తెలిపినాడు.
ఆత్మ ఇతరులను చంపునని భావించువాడను, ఆత్మ ఇతరులచే చంపబడునని భావించువాడును, ఆ ఇద్దరును అజ్ఞానులే. ఏలననగా వాస్తవముగా ఆత్మ ఎవ్వరిని చంపదు, ఎవ్వరిచేతను చంపబడేది కాదు. ఆత్మకు చావుపుట్టుకలు లేవు . ఇది జన్మ లేనిది. నిత్యమూ, శాశ్వతము, పురాతనము, శరీరము చంపబదడినను ఇది చావదు. ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు జననమరనములు లేనిదనియు, మార్పులేనిదనియు, శాశ్వతమైనది, సర్వవ్యాప్తిచెందినది, చలింపనిది, స్తిరమైనది మరియు సనాతనమైనది. ఈ ఆత్మ ఇంద్రియములకు గోచరముగానిది. మనస్సునకు అందనిది. వికారములు లేనిది. (2:19-25)

ఉపనిషతులు: ముండకోపనిషత్తులో ఈ ఆత్మ గురించి ఈ విధంగా వివరించబడినది.
జ్యోతిస్వరూపమైన ఆత్మ ప్రకాశవంతం అణువుకంటే సూక్ష్మం అంతటా వ్యపించినదీ, అత్యంతము సుక్ష్మమైనదీ సృష్టికి మూలకారణమైనదీ. అపరిమితమైన జ్యోతిస్వరూపం అయిన ఆత్మ ఊహాతీతమైన బ్రహ్మం ప్రకాశిస్తుంది. అది సూక్ష్మతి సూక్ష్మం, అది ఈ శరీరలోనే ఉన్నది. అక్కడ సూర్యుడు ప్రకాశించడు. చంద్రుడు తారలు(చుక్కలు) వెలుగు నీయవు. మెరుపులుకూడ కాంతి నీయవు. ఇక కేవలమైన అగ్ని మాట చెప్పడమెందుకు? స్వయం ప్రకాశమైన ఆత్మ తేజస్సు వళ్ళ మాత్రమే సర్వము కాంతులీనుతుంది! ఈ యావద్విశ్వము కూడఆ ఆత్మజ్యోతి వల్లనే దేదీప్యమానమవుతూ ఉన్నది.
స్వయం ప్రకాశిత,మైన జ్యోతిస్వరూపమైన ఆత్మను మాటలచేత వర్ణింపనలవికాదు, దాన్ని కళ్ళు చూడలేవు. ఇంద్రియాలు గ్రహించలేవు. కర్మలు విధులు దానిని ఆవిష్కరించలేవు. అవబోధ ప్రశాంతమై స్వచ్చమైనపుడు అతని ప్రాణ మన శరీరాలు సర్వం విశుద్ది పొందుతాయి. అపుడు ధ్యానమగ్నుడైనవాడు మాత్రమే ఆత్మను సాక్షాత్కరించుకుంటాడు.

ఆత్మ అంటే ఒక శక్తి (మనం అర్ధం చేసుకోవడానికి దానినే ఒక జ్యోతిగా తెలిపినారు). అటువంటి శక్తిస్వరూపమైన ఆత్మ దైవమే అవుతుంది తప్ప దయ్యము మాత్రము కాదు అని గ్రహించి మరియు సంపుర్ణమైన ఆ దివ్య శక్తి స్వరూపమైన ఆత్మ జ్ఞానాన్ని గ్రహించి, అది మాత్రమే నువ్వు అని తెలుసుకొని, దేదీప్యమానంగా స్వయంప్రకాశితమైన ఆ దివ్య జ్యోతిని నువ్వు నీ శరీరంలోనే దర్శించి, నిన్ను నువ్వుగా తెలుసుకొని, మనం అందరం ఎత్తిన ఈ మానవ జన్మను సంపూర్ణంగా సార్ధకం చేసుకుందాం.

ఓం నమో పరమాత్మయే నమః

శరన్నవరాత్రులలో అష్టమి తిధికి చాలా ప్రాధాన్యత

శరన్నవరాత్రులలో అష్టమి తిధికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. మొత్తం తొమ్మిది రోజులు పూజ , ఆరాధన చెయ్యని, చెయ్యలేని వారు అష్టమి నవమి తిధులలో అయినా అమ్మ ఆరాధన తప్పనసరిగా చెయ్యాలని శాస్త్రము చెప్తున్నది.

అష్టమికి ఉన్న ప్రత్యేకత ఎమిటి అంటే ఎప్పుడైనా సరే అమ్మవారిని ఆరాధించాలి కొన్ని ప్రత్యేకమైన తిధులు ఉన్నాయి...అవి అష్టమి,నవమి,చతుర్దశి, అమావాశ్య,పౌర్ణమి, ఈ తిధులను పంచమహాపర్వములు అని అంటారు, వీటిలో ఇప్పుడు అష్టమి అంటే మహాపర్వము అని అర్ధము.ఈ తిధులలో అరాధిస్తే అమ్మ ప్రీతి చెందుతుంది. కాని శరన్నవరాత్రులలో సప్తమి తో కూడిన అష్టమి పనికిరాదు. సూర్యోదయానికి అష్టమి తిధి ఉండాలి.

అశ్వినస్య చితాష్టమ్యాం అర్ధరాత్రేతు పార్వతి
భద్రకాళి సముత్పన్నా పూర్వాషాడః సమాయుతే
తత్రాష్టమ్యాం భద్రకాళి దక్షయగ్న వినాసిని
ప్రాతుర్భూతా మహాఘోర యోగిని కోటివిస్సః

ఆశ్వియుజ శుద్ధ అష్టమి అర్ధరాత్రి వేళ అమ్మవారు భద్ర కాళి రూపేణ ఆవిర్భవించింది.

భద్రకాళి అంటే దక్షయగ్న వినాసనం కోసం, శివుని జటాజూటం నుండి వీరభద్రుని తో పాటు ఉద్భవించినటువంటి అమ్మ ! నవరాత్రులలో అష్టమి తిధికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. మొత్తం తొమ్మిది రోజులు పూజ , ఆరాధన చెయ్యని, చెయ్యలేని వారు అష్టమి నవమి తిధులలో అయినా అమ్మ ఆరాధన తప్పనిసరిగా చెయ్యాలని శాస్త్రము చెప్తున్నది.

అష్టమి , నవమి తిధుల యందు అమ్మని దుర్గ గా , కాళి స్వరూపేణ పూజలు అందుకుంటుంది

సర్వవర్ణాల వారు ,సర్వ మతాల వారు , సకల జనుల వారు, సకల జనులు నిరభ్యంతరముగా ఉపాసించదగిన దేవత ఈ అమ్మ....దుర్గమ్మ! ఈ తల్లి సర్వజీవ అంతర్యామి. సంకటనాశిని. జగన్మాత, స్త్రీ, పురుష వయో భేదం లేకుండా సర్వులు ఉపాసించవలసిన పరాదేవత ఈ దుర్గమ్మ..

కామ బీజ స్వరూపిణి మహాకాళిగా, మాయా బీజ స్వరూపిణి మహాలక్ష్మిగా, వాగ్బీజ స్వరూపిణి మహాసరస్వతిగా దుర్గాదేవిని ధ్యానిస్తూ షట్కోణ సంయుక్తా అష్టదళ పద్మ - చతుద్వింశతి పత్రక - భూగృహ సమాయుక్త......ఇలాగ దుర్గమ్మను ధ్యానిస్తూ ఆరాధన చెయాలి.

సాలగ్రామములో కాని, మంగళకలశములో కాని, శ్రీ చక్రయంత్రములో కాని, దేవి ప్రతిమలో గాని, బాణ చిహ్నములో కాని, సూర్యుడిలో కాని....ఇలాగ ఎవరి ఆచారవిధానములబట్టి.....అమ్మ ని ఉపాసన చేయాలి.

జయాది శక్తియుతమైన పీఠములో దుర్గాదేవిని నిలిపి తూర్పు కోణములో సరస్వతి సమేత బ్రహ్మను, నైఋతి కోణములో లక్ష్మి సమేత మహా విష్ణువుని, వాయువ్య కోణములో పార్వతి సమేత పరమేశ్వరుడిని, దేవికి ఉత్తరముగా సింహాసనము, దక్షిణముగా మహిషాసురుడిని నిలిపి అర్చన చెయ్యాలి.

అనంతరం అష్టదళాలలో వరుసగా బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారహి, నారసిమ్హ, ఐంద్రి, చాముండికా రూపాలని ఆహ్వానించి అర్చన చెయ్యాలి.

దుర్గా స్తోత్రములు, అష్టొత్తరముతో పూజించాలి.

ఇలాగ మన శక్తి మేరకు అమ్మని పూజించి, ఆవిడ అనుగ్రహాన్ని పొందటానికి ప్రయత్నించాలి....

అమ్మని ఆరాధించడం వల్ల సర్వరోగాలు, సర్వ భయాలు తొలగి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు లభిస్తాయి. ధైర్యం వృద్ధి చెందుతుంది. దుఃఖం నశించి సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఇహంలో సౌఖ్యం, పరంలో మోక్షం సిద్ధిస్తాయి..

ముక్కోటి వైభవం!!

సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు. అలాంటి ముక్కోటి విశేషాలేమిటో చూద్దాం.

ముక్కోటి రోజున మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి.. భక్తులకు దర్శనమిస్తాడు. కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి.. మూడు కోట్ల ఏకాదశులతో సమానమట. అందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గళి' మధ్య.. ముక్కోటి ఏకాదశి వస్తుందని చెబుతారు.

వైకుంఠ ఏకాదశి రోజు.. ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడట. అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకూడదని అంటారు. ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన, పురాణపఠనం, జప, తపాలు నిర్వహిస్తారు. 'భగవద్గీతా' పుస్తకదానం చేస్తారు. మామూలు రోజుల్లో.. దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ, ముక్కోటి రోజున భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి మహావిష్ణువును దర్శనం చేసుకొంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తే మంచిదని చెబుతారు.

ముక్కోటి రోజున పూర్తిగా ఉపవసించాలి. తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈరోజున ఉపవాసం చేసినవారు పాప విముక్తులవుతారట. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేడంతో పాటు పాటించవలసిన పథ్యమే ఉపవాసం. 'లంకణం పరమౌషధ'మనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం. దైవానికి దగ్గరవాలన్నదే ఉపవాసంలోని ఆశయం.

పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి. ఏకాదశి వ్రతంలో ఏడు నియమాలున్నాయి. ఒకటి దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. రెండు.. ఏకాదశి రోజు మొత్తం- ఉపవాసం ఉండాలి. మూడు.. అబద్ధం ఆడకూడదు. నాలుగు స్త్రీ సాంగత్యం పనికి రాదు. ఐదు.. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆరు.. ముక్కోటి రాత్రంతా జాగరణ చేయాలి. ఏడు.. అన్నదానం చేయాలి.

ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే రెండు పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పర్వతమహర్షి సూచనమేరకు వైఖానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల.. నరక బాధలనుభవించే అతని పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారట!

మురాసురుడి కథ రెండోది. కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడు విష్ణుమూర్తికి విన్నవించారు. రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి, మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కాని, మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్లి, సాగరగర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ని బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి, ఒక గుహలోకి వెళ్లాడు. విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు, విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే! మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై, మురాసురుణ్ని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని, ఆమెకు 'ఏకాదశి' అనే బిరుదునిచ్చాడు! అప్పటినుంచి ఏకాదశీ వ్రతం ప్రాచుర్యం పొందింది.

ఇందులోని తాత్త్విక సందేశం ఇలా వుంది. విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. ఉపనిషత్తులు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్ధేశించి ఏకాదశీ వ్రతాన్ని నియమంగా ఆచరించాలి. ఉపవాసం ద్వారా పదకొండు ఇంద్రియాలను నిగ్రహంతో ఉంచుకుని, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించమని భావం. పంచజ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలతో కలుపుకుని మొత్తం పది. వాటితో పాటు.. మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారా పాపాలు చేస్తారు మానవులు. ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారని చెబుతారు. ఇదీ హిందువులు పరమపవిత్రంగా భావించే ముక్కోటి ఏకాదశికి చెందిన పూర్తి సారాంశం. 

గోమాత విశిష్టత

గోమాత ముక్కోటిదేవతల సమూహము. గోమాత కలియుగంలో సాక్షాత్ కామధేనువు వంటిది. కామధేనువు అనగా అడిగినదల్ల లేదనకుండా ప్రసాదిన్చునది అని అర్ధం. ఈ కలియుగంలో ఒక్కమారు గోమాత వ్రతం ఆచరిన్చినట్లయితే తప్పకుండ అనుకున్నపనులన్ని సఫలికృతము అవుతాయి.

గోపంచకమును ప్రతి పూజలోను వినియోగిస్తారు. కారణమేమనగా అది వినియోగించిన ప్రతివారు, ప్రత స్తలము శుద్ధి అవుతాయి. మనమాచరించే ప్రతి పూజలో గణపతి పూజ నుండి ప్రతిష్టాంతం వరకు పంచగవ
్యాలను వాడతారు. పంచగవ్యాలు అనగా ఆవుపాలు , ఆవుపెరుగు , ఆవునెయ్యి , ఆవుముత్రము , ఆవుపేడ.ఈయొక్క ఐదింటిని పంచగవ్యాములన్డురు. వీటితో పంచగవ్యప్రాసన అనేపూజ చేసి అవి తీర్ధముగా తీసుకొనవలెను. ఈతీర్దము సంవత్సరంలో ఒక్కసారైనా తప్పకుండ తీసుకోవలెను. అదేవిధంగా ఆవుపాలు చాలా శ్రేస్థామైనవి. చిన్నపిల్లలకు ఇచ్చినట్లయితే మంచితెలివితేటలు పెరుగుతాయి . మంచివిద్యావంతులవుతారు .
మనము తెలిసి తెలియక ఆడవారు అంటూ , ముట్టు ఇంట్లో కలిపినపాపమును , పెద్దలను దూషించిన పాపమును , సర్వపాతకములను , మహాపాతకములను , భక్తిపూర్వకముగా గోమాతను ధ్యానించిన , గోవులకు గ్రాసాములిచ్చినను , గోవులకు దాణాలిచ్చినట్లయితే , పైనచేప్పబడిన పాపములనుండి విముక్తి పొంది సర్వసంపదలు చెకూరునని శాస్త్ర ప్రమాణము . ఏకాదశి నాడు ఉదయమునే కాలకృత్యాలు నెరవేర్చుకొని గోమాత పూజ మరియు గోసేవ ఆచరిన్చినట్లయితే కాశి నగరంలో కోటిగోవులను దానము చేసినంత ఫలితము లభిస్తుంది.

వైకుంట ఏకాద‌శి విశిష్టత‌

ప్రతినెలలో పూర్ణిమకి ముందు వచ్చే ఏకాదశిని శుద్ధేకాదశి(శుద్ధ ఏకాదశి) అంటారు. సంవత్సరం మొత్తంలోఇటువంటి శుద్ధ ఏకాదశులు 12 వుంటాయి. వీటిలో ప్రతి ఏకాదశికి ప్రాముఖ్యత వున్నా, నాలుగు ఏకాదశులను విశేషదాయకంగా పరిగణిస్తాము. అవి:
ఆషాడ శుద్ధ ఏకాదశి.(తొలేకాదశి/శయనేకాదశి)
కార్తీక శుద్ధ ఏకాదశి
పుష్య శుద్ధ ఏకాదశి (వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి)
మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి)
వైకుంఠ ఏకాదశి/ ముక్కోటి ఏకాదశి
పుష్య శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అంటారు. ఒక చిన్న స్థలం ఉంటే తూర్పు దిక్కుగా నిలుచుంటే దానికి నిట్టనిలువుగా తూర్పు పశ్చిమాలు, అడ్డంగా ఉత్తర దక్షిణాలూ వుంటాయి. ఈ ఉత్త్తర దక్షిణ విభాగాన్ని ప్రాచీనులు కేవలం ప్రదేశాలకి మాత్రమే పరిమితం చేయకుండా కాలంలోనూ, శరీరంలోను కూడా ఈ విభాగాన్ని చేశారు.
కాలంలో ఉత్తరం పగలు; దక్షిణం రాత్రి
కుడి చేయి దక్షిణం; ఎడమ చేయి ఉత్తరం
ఎక్కడైనా (ఉత్తర – దక్షిణాలలో) ఉత్తరమే పవిత్రమైనది, శ్రేష్టమైనది.
దేవతలకు ఆరు నెలలు పగలు, ఆరు నెలలు రాత్రి. రాత్రిని దక్షిణాయనం, పగటిని ఉత్తరాయణం అన్నారు. దక్షిణాయనం వెళుతుండగా చీకటి తొలగి సూర్యుడు – అంటే వైకుంఠుడు, ముక్తుడుకాగా దేవతలు కూడా చీకటి పోయి వెలుతురుకు వస్తారన్నమాట. అనగా, వారి పగలు ప్రారంభమైందన్నమాట. ఈ వైకుంఠ ద్వారమన్నది సూర్యుని ఉత్తరాయణ ప్రవేశ చిహ్నముగా చెప్పుకుంటాము. ముక్కోటి దేవతలు ఈనాడు ఉత్తరమందున్న శ్రీ మహా విష్ణువును దర్శించుకుంటారు. అందుచే ప్రాతఃకాలంలో భక్తులుకూడా ముక్కోటి దేవతలతో కూడివున్న వైకుంఠుణ్ణి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ముక్తి పొందాలని భావిస్తారు. అందుకే దీన్ని మోక్షేకాదశి అని కూడా అంటారు.
యోగ శాస్త్రానికి సంబంధించిన విషయం చెప్పుకుందాం. యోగాభ్యాసాన్ని చేసే సాధకులందరు శ్రీహరి యోగనిద్రకు ఉపక్రమించిన శయనేకాదశి (ఆషాడమాసంలోని శుద్ధ ఏకాదశి)నాడు యోగ సాధనని ప్రారంభించి యదార్ధంగాను, నిష్టతోనూ సక్రమంగా చేస్తే, ఈ ఏకాదశి, అంటే పుష్య శుద్ధ ఏకాదశి, వైకుంఠ దర్శనమవుతుందనీ, ఆ కారణంగా ఇది వారి పాలిట వైకుంఠ ఏకాదశి అవుతుందని పెద్దలు గుర్తించిన అంశం.
ఏకాద‌శిన విష్ణు ద‌ర్శణం శుభ‌ప్రదం
ముక్కోటి దేవతలు వైకుంఠమునకు చేరుకొనే శుభపర్వ దినం వైకుంఠ ఏకాదశి. దీనినే ‘ముక్కోటిఏకాదశి’ పేరుతో వైషవాలయాల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి నాడు అన్ని వైష్ణవాలయాల్లో ఉత్తరంవైపు ఉండే వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు.
ఈ ద్వారం ద్వార స్వామిని దర్శించుకోవడం పుణ్యప్రదం. శ్రీమహావిష్ణువుతో బాటు ముక్కోటి దేవతలు ఈ రోజున భువికి దిగివస్తారని శాస్త్రవచనం. దక్షియణాయానంలో దివంగతులైన పుణ్యాత్ములు ఈ రోజున వైకుంఠ ద్వార౦ ద్వారా స్వర్గానికి చేరుకుంటారు. ఈ రోజు ఏకాదశి వ్రతం చేసి, విష్ణువుని పూజించి, ఉపవాసం, జాగరణ పాటించడ౦ వల్ల పుణ్యఫలితాలు లభిస్తాయి. ఏకాదశి ఉపవాస తిథి విష్ణు స్వరుపమైనది. ఈ వైకుంఠ ఏకాదశీనే ‘పుత్రదా ఏకాదశి’ అని అంటారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. దశమి రాత్రి కూడా భుజించకూడదు.
ద్వాదశినాడు ద్వాదశి ఘడియలు వెళ్ళాకముందే పారణం (భోజనం) చేయాలి. దేవతలకు ఆరునెలలు పగలు, ఆరునెలలు రాత్రి. దక్షిణాయానం రాత్రికాలం. ఈ చీకటి తొలగి దేవతలు వెలుగులోకి వస్తారు. అంటే వారికి పగలు ప్రారంభమైనట్టు.
అందుకే ఆ రోజు ఉపవాసం పుణ్యప్రదం. బ్రహ్మ స్వేదబిందువు నుండి రాక్షసుడు జన్మించాడని, బ్రహ్మ ఆజ్ఞతో ముక్కోటి ఏకాదశీ నుండి అన్నంలో నివసిస్తాడని పురాణ కథనం. అందుకే ఆ రోజున భోజనం మాని ఉపవాసం ఉండాలంటారు. ఏడాదిలో 24 ఏకాదశుల్లో ఉపవాశం ఉంటే వచ్చే మొత్తం ఫలితం ముక్కోటి ఏకాదశి రోజున లభిస్తుంది. 

సంక్రాంతి విధులు -మహిమలు

కాలమును రాత్రింబవళ్ళుగా విభజించే సూర్యచంద్రుల గమనంపై మానవ జీవన విధానం ఆధారపడి ఉంటుంది. అంతే కాక సంవత్సరంలో సూర్యుడు ఒక రాశినుండి మరొక రాశిలోనికి ప్రతినెల మారుతుంటాడు. ఇలా మారుటనే సంక్రమణమంటారు. ప్రవేశించిన ప్రతిరాశిలోను సూర్యుడొక మాసముంటాడు. కుంభరాశినుండి వృశ్చికరాశిక్ వరకు పదకొండు మాసాలుండి పన్నెండో రాశియైన మకరమున ప్రవేశించుట మహా సంక్రమణమని, సంక్రాంతి అని చెప్పబడేది ఈ పుష్యమాసంలోని సంక్రమణమే.

దీనినే ’ఉత్తరాయణ పుణ్యకాలమని’ అంటారు. సంవత్సరం ఉత్తరాయణమని, దక్షిణాయమని రెండుగా విభజించబడితే ధనుర్మాసాంతమున దక్షిణాయనం పూర్తై, నేటినుండి ఉత్తరాయణం ఆరంభమవుతుంది.
కనుక మకర సంక్రమణం జరిగే ఈరోజున ఉత్తరాయణ పుణ్యకాలమని చెప్తారు. ఈవిధంగా సంక్రమణద్వయం ఈనాడేర్పడుట వలన మహా సంక్రమణమైనది. ఇది చాలా శక్తివంతమైనది.

మహాసంక్రమణం శక్తిమంతం: సూర్యుడు ధుస్సు ప్రవేశించినప్పటి నుండి గృహాలు లక్ష్మీకళతో శోభిల్లుతూంటాయి. గోమయంతో శుద్ధి చేయబడిన ప్రాంగణాలు రంగవల్లులతో, అందు గొబ్బెమ్మలతో ప్రకాశిస్తుంటాయి. గృహద్వారాలు మామిడాకుల తోరణాలతో, రంగురంగుల బంతి పువ్వులతో, గపలు పసుపు, కుంకు,అలతో కళకళలాడుతూంటాయి. ఈవిధమైన లక్ష్మీశోభ వలన గృహాలలోని వారంతా సుఖశాంతులతో, ఆనందానుభూతి నొందుతూ శక్తిమంతులవుతున్నారు. ఈ ధనుర్మాస మనేది మార్గశిర మాసం, హేమంత ఋతువులో వచ్చేది. కనుక ఇది నరులకు పుష్టిని కలుగజేసే మాసం. తరువాత వచ్చే పుష్యమాసమింకను పుష్టిదాయకం.

’పుష్యమీ’ అనే ఈ పదమునకు అనేక అర్థాలున్నాయి. అవి-కోరికను వృద్ధి పొందించునది. దీనియందు ప్రయోజనములు సిద్ధిస్తుంది. కోరికను సాధించునది, దీనియందు కార్యసిద్ధి కొరకు సంతోషిస్తారు, ప్రకాశించునది.
స్నాన దాన యజ్ఞాలు: మకర సంక్రమణ కాలమున స్నానం ముఖ్యంగా చేయాలని చేయనివాడు ఏడుజన్మల వరకు రోగిగా, నిర్ధనుడుగా అగునని, అలాగే చేసిన దానధర్మాల ఫలితంగా ప్రతి జన్మయందు అటువంటి ద్రవ్యాు, కర్మలను సూర్యానుగ్రహం వలన తిరిగి పొందుతామని ధర్మసింధువచనం.
మకర సంక్రమణ సమయమున తిలధేను దానం, తిలతైలంతో శివాలయమున దీపదానం, తిలలు బియ్యం కలిపి శివారాధన, నల్లనువ్వులతో అభ్యంగన స్నానం, తిలదానం, తిలహోమం, నల్లనువ్వులతో పితృతర్పణం చేయవలెనని చెప్పబడినది.
సంపత్సమృద్ధివలన సజ్జనులు కల్మషము లేనివారై దీని అనుభవించుటకు ముందు ఆగ్రయణేష్టిని నిర్వహించి పితృదేవతల నారాధించి పాపరహితులవుతారని వాల్మీకి రామాయణమున చెప్పబడింది. అగ్నావైవేష్టి’ అనే ఈ యజ్ఞనిర్వహణవలన నేత్ర సంబంధ రోగములుండవని చెప్పబడింది.

ఈ యజ్ఞ నిర్వహణలోఎద్దులచే దున్నబడి పండించి ధాన్యము నుండి వచ్చిన బియ్యమును ఆవునేతితో వండి, ఆ చరువును (అన్నమును) అగ్ని, విష్ణువులకు హోమరూపంగా అందించాలి. ఇక్కడ వండబడిన అన్నమునకు మూలభూతములైన ఆజ్యమునకు, తండులములకు ఉత్పాదకములైన గోవృషభములు మిథునంగా వర్ణించబడ్డాయి. ఈ మిథున మూలకంగా నిష్పన్నమైన నేతిని, బియ్యమును గోవృషభముల రేతస్సుగా వర్ణించి ఆ రేతోద్వయ సమ్మేళన రూపమైన హోమ ద్రవ్య ప్రభావముచే నేత్ర రోగములకు ఆస్కారముండదని మంత్రబోధ.

ఇచ్చట గోవనగా లక్ష్మీ స్వరూపం. వృషభమనగా ధర్మం, నారాయణ స్వరూపం. అంటే మనకు ప్రాణాధారమైన అన్నము బ్రహ్మస్వరూపం. ఇలా బ్రహ్మ స్వరూపమగు సస్య సమృద్ధిని పుష్యమాసమందిస్తున్నది. "పృథివీ సస్యశాలినీ" అని రామాయణ వచనం.

మన సంపత్సమృద్ధికి కారకుడైన భగవంతుని పట్ల, వృక్షములు వలె, కృతజ్ఞత తప్పక చూపాలి. గర్వముండరాదు. కాబట్టి ఈ మకర సంక్రమణ మయంలో మనం నిర్వర్తించవలసిన విధివిధానమును తప్పక ఆచరించి భగవత్ప్రసాదమైన ఆహారమును మనం అనుభవిస్తే రోగ రహితులమై శక్తివంతులమై ఆనందంగా జీవితమును అనుభవిస్తాం.

ఆంగ్లమాసం ప్రకారం సంక్రాంతి జనవరి నెలలో 14 లేక 15 తేదీలలో సూర్యగమనము ననుసరించి వస్తుంది. పుష్యమాసమున వచ్చు సంక్రాంతి మూడురోజుల పండుగలాగ జరుపుకొంటారు. మొదటిరోజున ప్రాతఃకాలమున భోగిమంటలతో ఈ పండుగ నారంభిస్తారు. ఆడపిల్లలు ఇళ్ళలో బొమ్మలకొలువులు ఏర్పరుస్తారు. ముత్తయిదువులనాహ్వానించి వారి ఆశీర్వాదమును పొందుతారు. రెండవరోజు ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ఈ రోజున పైన చెప్పిన దానాదులను ఆచరిస్తారు. మూడవరోజు కనుమను పశువుల పండుగగా జరుపుకొనుట ఆచారంగా వస్తున్నది.

ఒక బీజమును నాటినపుడు అందుండి మొలక బయటకు వస్తుంది. అప్పటినుండి దానికవసరమగు రక్షణను నాటిన వారు కల్పించగా, అది ఏపుగా పెరిగి మనకవసరమైన పుష్పాలను గాని, కాయలు గాని ఇవ్వగలదు. అదిచ్చిన ఫలితమును చూచి మన కృషి ఫలించినదనే సంతృప్తి తప్పక ఉంటుంది కదా. అలాగే దంపతులు కూడ పుట్టిన పిల్లలను వారి పోషణకు తగినవి సమకూర్చుతూ జాతకర్మాదులను తీర్వహించి విద్యాబుద్ధులను నేర్పి పెంచినపుడు పైన చెప్పినట్లు తీగలు, చెట్లకు జ్వలె వారున పెంచిన వారికా ఆనందమును, తృప్తిని కలిగించాలి కదా. ఏ చెట్టుకాని, తీగకాని, తగిన శక్తిని గ్రహించిన తరువాత నా జీవితం నాదే అన్నట్లుండదు. పెంచిన వారి పట్ల కృతజ్ఞతతో ముందు చెప్పినట్లు కృతజ్ఞతా భావంతో తలలు వంచి అందుబాటులో ఉంటాయి. అలాగే పిల్లలు కూడా పెంచిన వారిపట్ల కృతజ్ఞతా భావంతో, వినయవిధేయలతో ఉండాలి.
ఇది అలవడాలంటే శాస్త్రాలలో చెప్పినట్ు వానిపై నమ్మకముండి, వాటిలో చెప్పినట్లు ఆయా కాలాలకు సంబంధించిన విధులను నిర్వర్తించాలి. తన కుటుంబానికి సుఖశాంతులను కలుగజేయాలి.

ఒకవేళ ఇవన్నీ చేయలేకపోయిన దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రమున చెప్పినట్లు నడచుకోవాలి. నాకే మంత్ర యంత్రములు తెలియవు. నిన్ను స్తుతించటం తెలియదు. ఆహ్వాన ధ్యానములును తెలియవు. నీ స్తుతి కథలు తెలియవు. నీ ముద్రలు తెలియవు. వ్యాకులతతో ఉన్నప్పుడు విలపించటం తెలియదు. కానీ మాతా! క్లేశమును హరింపజేసే నీ అనుసరణం మాత్రమే నేనెరుగుదును-అనాలి.
కాబట్టి నీవేమి చేయలేని స్థిిలో నున్నప్పుడు కనీసం ఆ దేవిననుసరించుటయైనా చేయాలి.

అలాగే ఈ మకరసంక్రమణ సమయమందు ఆచరించవలసిన వానిని మన పూర్వీకుల ఆచరణ చూచియైనా నేర్చుకొని వానినాచరింప ప్రయత్నమునైనా చేయాలి. దీనిద్వారా శాంతి సౌభాగ్యములు, లక్ష్మీ శోభ గృహమున శాశ్వతముగ నుండునట్లు చూడాలి. ఇది మన బాధ్యత.
లక్ష్మీర్దివ్యైర్గజేన్ద్రైః మమ వసతు గృహే సర్వ మాంగళ్య యుక్తా! అనే దానిని మరువరాదు. 

తిధికీ ఒక్కో దేవత

ఒకొక్క తిధికీ ఒక్కో దేవత అధిపతిగా వుండటం జరుగుతుంది. అదే విధంగా, పాడ్యమ్యాది తిధుల యందు వాటికి సంబంధించిన వ్రతాన్ని పన్నెండు మాసముల పాటు ఆచరిస్తే సత్ఫలితములు లభిస్తాయి.
తిథి అధిపతి మరియు వ్రత ఫలము గురుంచి క్లుప్తముగా క్రింద చెప్పబడినది.

పాడ్యమి :
అధిదేవత - అగ్ని. వ్రత ఫలం - సత్ఫల ప్రాప్తి.

విదియ :
అధిదేవత - అశ్విని దేవతలు. వ్రత ఫలం - ఆరోగ్య వృద్ది.

తదియ :
అధిదేవత - గౌరీ దేవి. వ్రత ఫలం - సుమంగళీ అనుగ్రహం.

చవితి:
అధిదేవత - వినాయకుడు. వ్రత ఫలం - కష్టములు తొలగిపోవుట.

పంచమి:
అధిదేవత - నాగ దేవత. వ్రత ఫలం - వివాహము, వంశ వృద్ది.

షష్టి :
అధిదేవత - సుబ్రహ్మణ్య స్వామి. వ్రత ఫలం - పుత్ర ప్రాప్తి.

సప్తమి:
అధిదేవత - సూర్య భగవానుడు. వ్రత ఫలం - ఆయురారోగ్య వృద్ది.

అష్టమి:
అధిదేవత - అష్టమాత్రుకలు. వ్రత ఫలం - దుర్గతి నాశనము.

నవమి:
అధిదేవత - దుర్గాదేవి. వ్రత ఫలం - సంపద ప్రాప్తిస్తుంది.

దశమి:
అధిదేవత - ఇంద్రాది దశ దిక్పాలకులు. వ్రత ఫలం - పాపాలు నశిస్తాయి.

ఏకాదశి:
అధిదేవత - కుబేరుడు. వ్రత ఫలం - ఐశ్వర్యము ప్రాప్తించును.

ద్వాదశి:
అధిదేవత - విష్ణువు. వ్రత ఫలం - పుణ్య ఫల ప్రాప్తించును.

త్రయోదశి:
అధిదేవత - ధర్ముడు. వ్రత ఫలం - మనస్సులో అనుకున్న కార్యం ఫలిస్తుంది.

చతుర్దశి:
అధిదేవత - రుద్ర. వ్రత ఫలం - మ్రుత్యున్జయము, శుభప్రదం.

అమావాస్య:
అధిదేవతలు - పితృదేవతలు. వ్రత ఫలం - సంతాన సౌఖ్యం.

పౌర్ణమి:
అధిదేవత - చంద్రుడు. వ్రత ఫలం - ధనధాన్య, ఆయురారోగ్య, భోగభాగ్య ప్రాప్తి.

ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి ? ఏ ముగ్గును ఎక్కడ, ఎప్పుడు వేయాలి ?

మన ధర్మంలో ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి? ఏ ముగ్గును ఎక్కడ,ఎప్పుడు వేయాలి?

ఇంటి / గడప/ గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి.

ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభాకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి. ఏ దేవతపూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా, నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి.

నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతేకాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్ర,తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు.

తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి. యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి. దైవకార్యలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి.

నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి.

దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు.

ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ, అమ్మవరు, శ్రీ మహావిష్ణు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆ స్త్రీకి 7 జన్మలవరకు వైదవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం, బ్రహ్మాండపురాణం చెబుతున్నాయి.

పండుగ వచ్చిందా కదా అని, నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు.

అంతేకాదండోయ్! మనం ముగ్గులు రోజు వేయలేక పేంట్ పెట్టస్తాం. దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకారోజు బియ్యపుపిండితో ముగ్గు పెట్టాలి.

నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. ముగ్గు పాజిటివ్ / దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది.

ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి. పూర్వం రోజూ సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు. వారే కాదు అడ్డుక్కునేవారు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి అడ్డుక్కునే వారు కాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించినవారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గు వేయరు. శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యాహ్నమైనా ముగ్గు వేస్తారు.

ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. మన ఆచరించే ఏ ఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకానేక అర్ధాలు, పరమార్ధాలతో కూడినవి. 

సరస్వతి స్తుతి:

విద్యార్ధిని విద్యార్ధులు నిత్యం ఈ క్రింది శ్లోకాన్ని
మూడు సార్లు తప్పక పఠించాలి

"శరదిందు నమాకారే పరబ్రహ్మ స్వరూపిణి
వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే" ! 

బ్రహ్మవైవర్త పురాణం లో "తిలకధారణ"

బ్రహ్మవైవర్త పురాణం లో "తిలకధారణ"

బొట్టుని సంస్కృతంలో "తిలకం" అని అంటారు.
నొదుటున బొట్టు పెట్టుకోవడం అనేది మన సనాతన సంప్రదాయపు విశిష్ట లక్షణం .
బొట్టు పెట్టుకున్న వాళ్ళ ముఖం చూస్తూ ఉంటే, వారిలో తేజస్సు, వర్చస్సు, కళ తాండవిస్తుంది.
అందుకునే, బొట్టు లేని మొఖాన్ని చూడకూడదు అని సంప్రదాయాలు పాటించే పెద్దవారు అంటూ ఉంటారు.
వైదిక కర్మలు ఆచరించేటప్పుడు నుదుటున తప్పకుండా "తిలకధారణ" చెయ్యాలి, అని "బ్రహ్మవైవర్త పురాణం " చెబుతోంది.

!! "స్నానం దానం తపో హోమో దేవతా పితృకర్మచ
తత్సర్వం నిష్ఫలం యాతి లలాటే తిలకం వినా
బ్రాహ్మణాస్తిలకం కృత్వా , కుర్యాత్సంధ్యాన్య తర్పణమ్" !!

అంటే,
"పుణ్య స్నానాలు చేసేటప్పుడు, దానం చేస్తునప్పుడు , తపస్సును ఆచరించేటప్పుడు, హోమం చేస్తునప్పుడు, దేవతార్చన చేసే సమయంలో, పిత్రుకర్మలను ఆచరిస్తున్నప్పుడు తప్పనిసరిగా నుదుటున తిలకధారణ చెయ్యాలి, లేకపోతే ఎటువంటి ఫలితాలని ఇవ్వవని , అదేవిధంగా బ్రాహ్మణులు సంధ్యావందనాన్ని చేసేటప్పుడు, తర్పణాలను విడిచేటప్పుడు , తప్పని సరిగా తిలకాన్ని ధరించాలని అర్ధం.
బ్రహ్మవైవర్త పురాణం లో "తిలకధారణ" ................................... బొట్టుని సంస్కృతంలో "తిలకం" అని అంటారు. నొదుటున బొట్టు పెట్టుకోవడం అనేది మన సనాతన సంప్రదాయపు విశిష్ట లక్షణం . బొట్టు పెట్టుకున్న వాళ్ళ ముఖం చూస్తూ ఉంటే, వారిలో తేజస్సు, వర్చస్సు, కళ తాండవిస్తుంది. అందుకునే, బొట్టు లేని మొఖాన్ని చూడకూడదు అని సంప్రదాయాలు పాటించే పెద్దవారు అంటూ ఉంటారు. వైదిక కర్మలు ఆచరించేటప్పుడు నుదుటున తప్పకుండా "తిలకధారణ" చెయ్యాలి, అని "బ్రహ్మవైవర్త పురాణం " చెబుతోంది. !! "స్నానం దానం తపో హోమో దేవతా పితృకర్మచ తత్సర్వం నిష్ఫలం యాతి లలాటే తిలకం వినా బ్రాహ్మణాస్తిలకం కృత్వా , కుర్యాత్సంధ్యాన్య తర్పణమ్" !! అంటే, "పుణ్య స్నానాలు చేసేటప్పుడు, దానం చేస్తునప్పుడు , తపస్సును ఆచరించేటప్పుడు, హోమం చేస్తునప్పుడు, దేవతార్చన చేసే సమయంలో, పిత్రుకర్మలను ఆచరిస్తున్నప్పుడు తప్పనిసరిగా నుదుటున తిలకధారణ చెయ్యాలి, లేకపోతే ఎటువంటి ఫలితాలని ఇవ్వవని , అదేవిధంగా బ్రాహ్మణులు సంధ్యావందనాన్ని చేసేటప్పుడు, తర్పణాలను విడిచేటప్పుడు , తప్పని సరిగా తిలకాన్ని ధరించాలని అర్ధం.

ధర్మమే గెలుస్తుంది

ధర్మమే చివరికి గెలుస్తుందని మన వేద పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి. ధీరులైన వారు ఎన్ని కష్టాలు వచ్చినా వెనుకంజ వేయరు.
జీవితంలో సుఖం కన్నా దుఃఖమే మనకు ఎక్కువ పాఠాలు నేర్పుతుంది. భగవంతుడు సర్వులకూ చెందిన వాడు. అయినా అందరూ ఆయనలో లేరు.
మనిషి సుఖంగా ఎలా జీవించాలో ధార్మిక సాహిత్యం చెబుతుంది.

వ్యసనాలకు లోనైతే భగవంతుడు అండగా ఉన్నా కష్టాలు పడవలసిందేనని తెలుపుతుంది పాండవుల కథ.
ధర్మరాజు అంతటివాడు కూడా జూదంవల్ల సర్వం కోల్పోయి, అడవులకు వెళ్ళవలసి వచ్చింది. ఇక మనమెంత? ఈ విషయం తెలుసుకొని వ్యసనాలను వదిలిపెట్టాలి.
వ్యసనాలతో సంపదలూ, సర్వం కోల్పోతున్నా వివేకజ్ఞానం లేక కష్టాలు పడతారు జనులు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. పాండవులు అడవుల పాలైనా, వారు ఎప్పుడూ నిరుత్సాహపడలేదు.
వారు ధర్మపరులు కనుక, చివరకు దైవ సహాయంతో అధర్మంపై గెలిచి, సుఖసంతోషాలను పొందారు. కష్టాలు అందరికీ వస్తాయి. వాటిని మనం ఎలా స్వీకరిస్తున్నామన్నదే ముఖ్యం.
కష్టాలు కోతులలాంటివి. వాటికి భయపడితే మనం సర్వనాశనమవుతాం. వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళడం నేర్చుకోవలసిందని స్వామి వివేకానంద చెప్తారు.
ఈ గుణపాఠాన్ని ఆయన స్వయంగా తెలుసుకున్నారు. ఆత్మ విశ్వాసంతో కష్టాలను ఎదుర్కొని, పాండవుల లాగా విజయం సాధించాలి.
వేద, పురాణ ఇతిహాసాల సారాంశాన్ని మన జీవితానికి అన్వయించుకొని, ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలి. లేకపోతే నష్టపోయేది మనమే!
"సత్యమేవ జయతే" - ఎన్నటికైనా సత్యమే గెలుస్తుంది. అసత్యం, అబద్ధం, అధర్మం, గెలవవు. ఎల్లప్పుడూ సత్యాన్ని అంటి పెట్టుకోవాల్సిందని శ్రీరామకృష్ణుల ఉవాచ.
భగవద్ విశ్వాసంతో, శరణాగతితో మనం జీవితంలో విజయ సోపానాలను అధిరోహించాలి..... 

ప్రార్ధనా గదిని ఎందుకు కలిగి ఉండాలి?


భారతీయులందరూ పూజకై, ప్రార్ధనకై ఒక గదిని లేక కొంత స్థలాన్ని తమ గృహములలో కేటాయిస్తారు. ప్రతి రోజూ దైవానికి ముందు ఒక దీపాన్ని వెలిగిస్తారు.
జపము, ధ్యానము, పారాయణము, ప్రార్ధనలు, భజనలు మొదలగు ఆధ్యాత్మిక సాధనలు కూడా ఈ ప్రార్ధనా స్థలమందు జరుపుతారు.
పుట్టిన రోజు, వివాహాది దినములు మరియు పండుగలు మొదలైన అన్ని శుభ సందర్భాలలో ప్రత్యేకమైన పూజలు చేస్తారు.
గృహములోని పెద్దలు, పిన్నలు అందరు కూడా దైవముతో సాన్నిధ్యము కలిగి పూజ చేసికొంటారు.

పూజాగది - ఎందుకు?
ఈ చరాచర సృష్టికి పరమాత్మ మాత్రమే సొంత దారుడు. కావున మనము నివసించే గృహానికి కూడా నిజమైన హక్కుదారు పరమాత్మయే. పూజా గది అనేది ఆ యజమాని ఐన పరమాత్మ గది.
మనము భగవంతుని సొత్తుకు నిజమైన సొంత దారులము కాము అనే భావన వలన మాత్రమె మన దురహంకారము, మనది అనే పెత్తందారి తనమును వదిలించుకోగలము.

మనము నివసించే గృహమునకు మరియు మనకు కూడా యజమాని భగవంతుడే. మనము కేవలము ఆయన గృహానికి నియమించబడ్డ నిమిత్త మాత్రులమైన సేవకులము
అన్న సరైన భావన కల్గి ఉండటము ఉత్తమము. ఈ విధముగా భావించ వీలు కానిచో భగవంతుడిని మన గృహానికి విచ్చేసిన ముఖ్య అతిధిగా భావించి ఆయన సంతోషముగా
ఉండడానికి పూజ గదిని కానీ, దైవ పీఠమును గాని వసతిగా కల్పించాలి. అన్ని వేళలా ఆ ప్రదేశం శుభ్రముగా మరియు అలంకార యుక్తంగా ఉండేలా చూడాలి
(ఉన్నతాధికారి మన ఇంటికి వస్తుంటే వారికి చేసే సౌకర్యాలకన్నా కొంత ఎక్కువగానే ఉండేలా చూడాలి).

పరమాత్మ సర్వ వ్యాపి . ఈ విషయము గుర్తుంచు కోవడానికి ఆయన మన ఇంట్లో మనతో ఉండడానికి మనము పూజా గదులను కల్గి ఉండాలి.
భగవంతుని అనుగ్రహము లేనిదే మనము ఎ పనిని విజయవంతముగా చేయలేము, దేనిని సాధించ లేము.
పూజ గదిలో భగవంతుడిని ప్రతి రోజూ ప్రార్ధించటము వలన సన్నిహిత సంబంధము ఏర్పడి ఆయన అనుగ్రహాన్ని త్వరగా పొందగలము.

ఇంటిలోని ప్రతి గది ఒక ప్రత్యేకమైన పనికి నిర్దేశింపబడి ఉంటుంది. ఆయా గదులు ఆయా నిర్దేశింపబడిన పనులకు అనుకూలము కల్గి ఉండేలాగా అమర్చి ఉంటాయి.
అదే విధముగా ధ్యానానికి, పూజకు, ప్రార్ధనకు కూడా అనుకూలమైన వాతావరణము కల్గినటువంటి పూజాగది మనకు అవసరము .
పవిత్రమైన ఆలోచనలు, శబ్దతరంగాలు ఆ ప్రదేశములో వ్యాపించి అక్కడకు వచ్చినవారి మనస్సుల్ని ప్రభావితము చేస్తాయి .
మనము అలసిపోయినప్పుడు లేక కలత చెందినప్పుడు కేవలము ప్రార్ధనా గదిలో కొద్దిసేపు కళ్ళు మూసుకుని కూర్చుంటే కూడా చాలు ప్రశాంతత, ఉత్సాహము, ఆధ్యాత్మిక ఎదుగుదల పొందగలము

దేవాలయంను దర్శించుకునే పధ్ధతి.

దేవాలయం అంటే దైవం నెలవున్న స్థలం. పరమపవిత్రమైన క్షేత్రం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భక్తుల అభీష్టములు తీర్చడానికి కొలువైఉన్న పరమ పావన నివాసం. అలాంటి దేవాలయమునకు దర్శనమునకు వెళ్ళునపుడు కొన్ని ధర్మములను / పద్ధతులను ఆచరించాలి. అప్పుడే ఆ దైవం యొక్క అనుగ్రహమునకు పాత్రులము అవుతాము.

1) ప్రతి భక్తుడు ( స్త్రీ పురుషులు ) గుడికి వెళ్ళే ముందు శుచిగా స్నానం చేసి, విధిగా నుదుట కుంకుమ ధరించాలి.

2) సంప్రదాయమైన వస్త్రములు ధరించాలి. స్త్రీలు చీరలు, పురుషులు ధోవతి-ఉత్తరీయం, ఆడపిల్లలు పరికిణీలు లేదా చుడీదార్ ధరించాలి. ( చాలామంది ఆడపిల్లలు జీన్స్ టీ షర్టులు- మగపిల్లలు షార్టులు ధరించి వెళుతున్నారు. ఇలా ధరించినవారిని ఆలయ ప్రవెశమునకు అనుమతిని ఇవ్వకుండా యాజమాన్యం చూసుకోవాలి. తల్లి తండ్రులు ప్రొత్సహించరాదు .)

3) కనీస పూజా సామాగ్రిని తీసుకొని వెళ్ళాలి. పెద్దవారి దగ్గరికి వెళ్ళినా మహాత్ముల దగ్గరికి వెళ్ళినా ఒట్టి చేతితో వెల్లరాదు. గీతలో పరమాత్ముడు '' పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి" ...ఎవరైతే నాకు భక్తీతో పత్రం కాని పుష్పం కాని ఫలం కాని ఉదకం కాని సమర్పిస్తారొ వాటిని ప్రీతితో స్వీకరిస్తాను'' అన్నాడు.

4) గుడి ముందుకు చేరుకోగానే మొదట కాళ్ళూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

5) ఆలయం ప్రవేశించడానికి ముందు గోపురానికి నమస్కరించి తర్వాత మెట్లకు నమస్కరించాలి.

6) లోనికి ప్రవేశించినప్పటినుండి భగవంతుని నామం జపిస్తూ అన్యమస్కంగా కాకుండా ఏకాగ్రత అంతా దేవుడిపైనే ఉంచాలి.

7) నామ జపం చేస్తూ మధ్యమ వేగంతో గర్భాలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి పురుషులు స్వామికి కుడి వైపు, స్త్రీలు ఎడమ వైపు నిల్చోవాలి.

8) మొదట మూల విగ్రహం పాదాలను దర్శించి అందులో లీనం కావాలి.తరువాత స్వామి కళ్ళలోకి చూస్తూ లీనం కావాలి.

9) అర్చన చేసుకునేవారు తమ గోత్రము ఇంటిపేరు నక్షత్రము చెప్పుకోవాలి. తీర్థం తీసుకునే సమయంలో అరచేయిని గొకర్నాక్రుతిలొ ఉంచి చేయి కింద ఏదైనా వస్త్రం ఉంచుకుని '' అకాల మృత్యు హరణం ...'' అనే మంత్రం స్వయంగా చెప్పుకుంటూ భక్తితో తీర్థాన్ని చప్పుడురాకుండా తీస్కోవాలి.

10) దర్శనం అయిన తరువాత కాసేపు కూర్చొని నామ జపం చేస్తూ ప్రశాంత చిత్తంతో ఉండాలి.

11) ప్రసాదం భక్తులందరికీ పంచి తామూ భక్తితో తీస్కోవాలి.

12) తిరిగి వెళ్ళే ముందు మళ్ళీ స్వామికి నమస్కరించుకుని బయటికి వచ్చిన తరువాత మళ్ళీ గోపురానికి నమస్కరించి వెళ్ళాలి.

13) ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు వేగం కూడదు.

14) అనవసరంగా మాట్లాడటం.. పరుషపదజాలం ఉపయోగించకూడదు

15) ఆవలింతలు, జుట్టు పీక్కోవడం, తల గీక్కోవడం, తమలపాకులు వేయకూడదు.

16) జననం, మరణం సంబంధించిన విషయాలపై మాట్లాడకూడదు.

17) టోపీలు, తలకు వస్త్రాలు కట్టుకోవడం చేయకూడదు.

18) ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర స్థలాలను తొక్క కూడదు.

19) ఆకర్షణీయ దుస్తులను ధరించకూడదు.

20) నందీశ్వరుడు, శివలింగానికి మధ్యలో వెళ్ళకూడదు.

21) దర్శనం పూర్తయ్యాక వెనకవైపు కాస్త దూరం నడిచి, తర్వాత తిరగాలి.

22) ఒక చేత్తో దర్శనం చేయకూడదు.

23) భుజాలపై టవల్స్ వేసుకుని దర్శనం చేయకూడదు.

24) ఆలయంలో భుజించడం, నిద్రించడం చేయకూడదు.

25) ఆలయంలో ఎత్తైన ప్రాంతంలో కూర్చోకూడదు.

26) బలిపీఠంలో ఉన్న సన్నిధిని మ్రొక్కకూడదు.

27) ఆలయ ఆస్తులను అపహరించకూడదు.
28) అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి, మాస ప్రారంభం, సోమవారం, ప్రదోషం, చతుర్థి రోజుల్లో బిల్వ దళాలను తుంచకూడదు.

29) ఆలయంలో స్నానం చేయకుండా ప్రవేశించకూడదు.

30) మూల విరాట్‌ వద్ద దీపం లేకుండా దర్శనం చేయకూడదు.

31) ఆలయానికి వెళ్లొచ్చిన వెంటే కాళ్లను కడగకూడదు. కాసేపు కూర్చున్న తర్వాతే ఇవన్నీ చేయాలి.

32) ఆలయంలోకి ప్రవేశించి, తిరిగి వచ్చేంతవరకు నిదానం ప్రదానంగా ఉండాలి.

33) గోపుర దర్శనం తప్పక చేయాలి.

34) ఆలయంలోని మర్రి చెట్టును సాయంత్రం 6గంటల తర్వాత ప్రదక్షిణలు చేయకూడదు.

35) ఆలయంలోపల గట్టిగా మాట్లాడకూడదు.

36) మన మాటలు, చేష్ఠలు ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు.

ఈశావాస్య ఉపనిషత్తు


ఉపనిషత్తుల సారమంతా నింపుకున్న ఒక గొప్ప ముఖ్యమైన మంత్రము.., "ఈశావాస్య ఉపనిషత్తు" లో
చెప్పబడింది. అందుకే, ఒకసారి ఈ మంత్ర విశేషాన్ని గురించి వివరిస్తూ "స్వామి వివేకానందుల" వారు ఈ విధముగా అన్నారు, "ఎంతో విలువైన మన భారత వేద శాస్త్రాలు ఒకవేళ పూర్తిగా సమసి అంతరించిపోయినా, ఈశావాస్య ఉపనిషత్తులోని మొదటి ఒక్క శాంతి మంత్రం మిగిలితే చాలు.. వేదాల సారమంతా తిరిగి లభించినట్టే" అని. అంత ఘనత కలిగినది ఈ మంత్రము. 

ఈశావాస్య ఉపనిషత్తు -
ఓం శాంతి మంత్రం..

"పూర్ణమదః పూర్ణమిదం
పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవావశిష్యతే"


భావము :- "అది పూర్ణము. ఇది పూర్ణము. పూర్ణము నుండే పూర్ణము ఉద్భవిస్తుంది. పూర్ణమునుండి పూర్ణమును తీసివేసినా, పూర్ణమునకు పూర్ణమును జోడించినా పూర్ణమే మిగిలుతుంది."

విశ్లేషణ :-  "సకల బ్రహ్మాండము పూర్ణము. ఈ జీవ సంతతి ఉన్న భూమండలము పూర్ణము. బ్రహ్మాండము నుండి భువి ఉద్భవించినది. ఆ బ్రహ్మాండమునకు భువి కూడినా తీసివేయబడినా తుదకు మిగిలిఉండేది అనంతమైన బ్రహ్మాండమే."
(అద్వైత పరంగా చెప్పాలంటే...) "ఆ పరమాత్ముడు పరిపూర్ణుడు. ఈ జీవాత్మలు పూర్ణములు. పరమాత్ముని అంశలమైన జీవుడు తిరిగి ఆ పరమాత్ముని యందే కలువగా పరమాత్మయే అంతిమ గమ్యము అగును. ఉన్నదంతా ఒక్కటే. రెండవదేదీ లేదు. అనంత బ్రహ్మాండము అనేకముగా కనిపించినా, సృష్టిలోని పిండాండాలనీ ఆ బ్రహ్మాండ స్వరూపాలే. కనుక, అంతా వేరుగా కనపడుతున్న ఒక్కటే అని సారము, అద్వైత సిద్ధి కూడా ఇదియే."  

శివాలయంలో విధానం

సాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చెసుకునే విధానం,శివాలయంలో విధానం వేరు వేరుగా ఉంటుంది.
అందుకే,శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్సించినట్లే అని చెప్పబడింది.

శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. అందులో నాలుగు ముఖాలు, నాలుగు దిక్కులని చూస్తుంటే, ఐదవ ముఖం ఊర్ద్వముఖమై (పైకి చూస్తు/ఆకాశం వైపు చూస్తూ) ఉంటుంది.
5 ముఖాలకి, 5 పేర్లు న ిర్దేశించబడ్డాయి. అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చొని అయినా,పూజ చేయోచ్చు అంటారు.
శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది, కోరిన కోర్కెలు వెంటనే తీర్చేది, పశ్చిమాభి ముఖమైన శివాలయం. అంటే, మీరు,గుడిలోకి వెల్లగానే, శివలింగం పశ్చిమం వైపు చూస్థూ ఉంటుంది.. అలా శివలింగంకి ఎదురుగా ఉన్న ద్వారం పశ్చిమం వైపు ఉన్నా, లేదా, శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నా, దానిని, సద్యోజాతజాత శివలింగం అని అంటారు.
అప్పుడు మనం తప్పకుండా,అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు, ఓం సద్యోజాత ముఖాయ నమః అని అనాలి.శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం, సద్యోజాత శివలింగం.
శివలింగం, తూర్పు వైపుకు చూస్తూ ఉంటే, అటువంటి శివలింగాన్ని, తత్పురుష ముఖం అని అంటారు. తత్పురుష ముఖం అనేది మనల్ని తిరోదానాన్ని చేస్తూ ఉంటుంది.. తిరోదానము అంటే చీకటిలో ఉంచటం. అది, మనల్ని మాయ చేత కప్పబడిస్తూ చీకటిలో ఉంచుతూ ఉంటుంది..
ఆ మాయ కమ్మి ఉండడం చేతనే మనం అన్ని రకాల పాపాలు చేస్తూ ఉంటాం.. ఆ మాయని కప్పి ఉంచే ముఖమే ఆ సద్యోజాత ముఖం.
సద్యోజాత ముఖం పూజించ తగినదే,ఏ మాత్రం అనుమానం లేదు.. మనల్ని రక్షించినా,శిక్షించినా, అన్ని ఆ పరమేశ్వరుడేగా.

తూర్పుని చూస్తూ ఉండె శివలింగం, వాయువు (గాలి) మీద అదిష్టానం కలిగి ఉంటాడు.. ...

మనకు ప్రతీ శివాలయంలోనూ ఈ 5 ముఖాలు ఉంటాయి.. శైవాగమనంలో చెప్పినట్లుగా, మనం తప్పకుండా, శివాలయంలో, ఏ దిక్కు వైపు వెలితే,ఆ శివలింగం పేరుని స్మరించాలి.

ముఖాలు, మనకు 5 ఫలితాలని కలుగచేస్తాయి. ఆ 5 ముఖాలలో నుండే, స్ర్రుష్టి, స్థితి, లయ,తిరోదానము,అనుగ్రహము(మొక్షము) ఇవ్వబడతాయి.. అన్ని ముఖాలు,పూజనీయమైనవే.. అన్ని ముఖాలని మనం పుజించి తీరాల్సిందే.శివలింగం, దక్షిణం వైపు చూస్తూ ఉంటే, అటువంటి ముఖం, దక్షిణామూర్తి స్వరూపం. మనకు, శివాలయంలో, దక్షిణం ని చూస్తూ తప్పకుండా దక్షిణామూర్తి ఉంది తీరాలి. అసలు, దక్షిణామూర్తి విగ్రహం లేకుండా, శివాలయాలు కట్టకూడదు.
శివలింగం, దక్షిణానికి చూసే ముఖాన్ని, దక్షిణామూర్తి స్వరూపంగా, చూడమని చెప్తారు. ఆ ముఖాన్నే, అఘోర ముఖం అంటారు. ఈ అఘోర ముఖం , అగ్నిహోత్రానికి అంతటికీ, అధిష్టానం అయ్యి ఉంటుందిఈ సమస్త ప్రపంచాన్ని,లయం చేసే స్వరూపమే,ఈ అఘోర ముఖం. ఈ అఘోర ముఖమే, సమస్త ప్రపంచాన్ని లయం చేసి,మళ్ళీ,మనకు జన్మను ఇస్తూ ఉంటారు. మనకు మృత్యువు పట్ల,భయం పొగొట్టేది,మనకి ఙ్ఞానం ఇచ్చేది ఇదే.
మీరు జాగ్రత్తగా గమనిస్తే, చిన్న పిల్లలకు చదువు దగ్గర నుండి,సంపద(ధనము) దగ్గర నుండి, పెద్దలకు మొక్షము వరకు, దక్షిణా మూర్తి ఇవ్వలేని సంపద,విద్య లేనేలేదు. చదువుకు, సంపదకు, మొక్షముకి అదిష్టానం అయి ఉంటాడు.

ప్రతీరోజూ, ఒక్క 2 నిమిషాలు దక్షిణామూర్తిని ద్యానం చేస్తే, మొక్షము కరతళామలకము. వారి,అంత్యమునందు, సాక్షాత్తు, ఈశ్వరుడే, గుర్తుపెట్టుకొని, మొక్షముని ప్రసాదిస్తాడు.

ద్యానం చేయటానికి అత్యంత మంగళకరమైన స్వరూపం, అందమైన స్వరూపం, శాంతమైన స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం.
ఉత్తరం వైపు చూసే ముఖంని, "వామదేవ" ముఖం అని అంటారు.

ఇప్పటిదాక, 4 దిక్కులని చూస్తున్న, 4ముఖాల గురుంచి తెలుసుకోగలిగాం కదా!..

ఇక చివరి ముఖం, శివలింగం పైన (అంటే, ఆకాశం వైపు చూస్తూ ఉండే ముఖం) ఉండే ముఖం, ఆ ముఖంని "ఈశాన ముఖం" అంటారు. మనం, లింగం పైన చూసి, ఓం ఈశాన ముఖాయ నమః. అని అనాలి.

ఈశాన ముఖ దర్సనం, మనం మిగిలిన 4 ముఖాలని దర్సించిన తర్వతనే దర్సించాలి.. అప్పుడే విశిష్ట ఫలితం అని చెప్పబడింది. మనకు కాశీలో ఉండే ముఖం, అఘోర ముఖం. కాశీలో శివలింగం ఉత్తరం వైపు కూర్చొని, దక్షిణం వైపు చూస్తూ ఉంటుంది.
ఉత్తరం వైపు చూసే "వామదేవ ముఖం" నీటి మీద అధిష్టానం అయి ఉంటుంది. ఈ వామదేవ ముఖమే మనకు సమస్త మంగళమును ఇచ్చే ముఖం.

వామదేవ ముఖం అంటే ఎమిటి అనేది మనకు శివపురణంలో చెప్పబడింది. యదార్ధమునకు అదే విష్ణు స్వరూపం. అందుకే, విష్ణువు శివుడు ఒకరే.. రెండు లేనే లేవు...

శివపురణంలో రాస్తే ఎలా నమ్మాలి అని ఎవరికి సంసయం ఉంటే, ఒకటి గమనించండి.

శివఫురణం ని రాసినది, వేదవ్యాసుడు.. వ్యాసుడే విష్ణువు. విష్ణువే వ్యాసుడు. వ్యాసాయ విష్ణు రూపాయ,వ్యాస రూపాయ విష్ణవే, నమో వైబ్రహ్మ నిధయే వాశిష్టాయ నమో నమః ఉన్న పరమాత్మ ఒక్కడే.. రెండు కాదు.. చాలా మంది, వేరుగా చూస్తూ,పొరపడుతున్నారు..

క్రిష్ణ అని పిలిచినా నేనే పలుకుతాను. మూర్తి అని పిలిచినా నేనే పలుకుతాను.

ఈ వామదేవ ముఖం ని, ఓం వామదేవాయ నమః అని అంటే, మనకు అనారోగ్యం కలగకుండా,చూస్తాడు...

అంతే కాక, ఈ వామదేవ ముఖంని ఓం వామదేవాయ నమః అని అంటే,మనకు 3 ఫలితాలని కూడ ఇస్తుంది..అవి, 1) మీ దగ్గర ఏదైతో ఉందో, అది మీ చేయి జారి పోకుండ,మీతోనే ఉంచుతాడు.2) మనకు ఉత్తరోత్తరాభివృద్ధిని అయనే ఇస్తారు.3) మనకు ఉన్నదానిని అనుభవించే ఆరోగ్యమ్ని ప్రసాదిస్తాడు.

తదుపరి,ఈశాన ముఖము. శివాలయలో లింగ దర్శనం అయ్యాక, ఒక్కసారి, పైకి చూసి, ఓం ఈశాన ముఖాయ నమః అని అనాలి. ఆ ఈశాన ముఖమే మనకు మొక్షాన్ని ప్రసాదించేది. ఈ ఈశాన ముఖం ఆకాశంకి అధిష్టానం అయ్యి ఉంటుంది.
శివలయంలో మనకు బలిపీఠం అని ఉంటుంది. అక్కడికి ప్రదక్షిణంగా వెల్లినప్పుడు, మనలో ఉండే, అరిషట్ వర్గాలని మనం అక్కడ బలి ఇస్తున్నట్లుగా సంకల్పం చేసుకోని ముందుకు సాగాలి.

శివాలయలో పురుషులకి, ప్రత్యేకమైన వస్త్రధారణ నిర్దేసించబడింది. పురుషులు కేవలం పంచ మాత్రమే ధరించి, పైన ఉండే ఉత్తర్యం ని, నడుముకు కట్టుకొని మాత్రమే ప్రదక్షిణలు చేయాలి. అలా ఎవరైతే చేస్తారో, వారి పట్ల పరమశివుడు అత్యంత ప్రసన్నమవుతాడు. ముందుగా చెప్పినట్లు, పదఘట్టన వినపడకూడదు జాగ్రత్త.

మీరు శివాలయంలో, ఎట్టి పరిస్థితులలోను, విభూధిని కాని, బిల్వ పత్రాలనికాని, కుంకుమ కాని,ప్రసాదం కాని ఎట్టి పరిస్థితులలోను, నందీశ్వరుడి మీద పెట్టరాదు. సాధారణంగా, చాలా మంది, నంది మీద విభూధిని, బిల్వ ఆకులని వేస్తూ ఉంటారు. అది చాలా మహా పాపంగా పరిగణించబడింది. వీలైతే, అందరూ, శివరాత్రి రోజు, శివమహిమ్నా స్తోత్రం చదవండి.. శివస్తొత్రాలు అన్నింటిలోకి, చాలా ప్రాముఖ్యమైనది "శివమహిమ్నా స్తోత్రం"