Saturday, 18 January 2014

ఋగ్వేదము

చతుర్వేదములైన ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము లలో ఒకటైనా వేదము

పాదబద్దములగు మంత్రములను "ఋక్కు" అని అంటారు. ఈ వేదమునందు ఇటువంటి మంత్రములే ఉండుటవలన ఈ వేదమునకు ఋగ్వేదము అని పేరు వచింది. ఈ వేదమునకు 21 శాకాలు కలవు. ఈ 21 శాకలలో ప్రస్తుతం శాకలశాఖ, భాష్కలశాఖ అను 2 శాఖలు మాత్రమే లభించుచున్నవి. ఇందులో వ్యవసాయ విధానం, వ్యాపార విధానం, ఓడలు, విమానం, రైలు, తాయారు చేయు విధానం. టెలిగ్రాం, wire less వంటి ఆధునిక పరికరములు ఏ విధంగా తయారు చేయాలో విఫులంగా వివరింపబడినది. యజ్ఞము, యాగము వంటి చేయు క్రతములలో హవిర్భాగాములు గ్రహించు నిమిత్తం హోయతను ఋత్వికు ఈ వేదమంత్రములతో దేవతలను ఆహ్వానించును. ఆ దేవతలకు హవిస్సులను  అర్పించుటకు చాల ఉపయోగకరమైనది పరిగణింపపడినది. అందుకే ఈ వేదమునకు "హుత్రవేదము" అని పేరు కూడా ఉన్నది. ఈ ఋగ్వేదమును 10 మండలములుగా విభజించారు, వేరొక శాఖ వారు 8 అష్టకములుగా విభజించారు

Friday, 17 January 2014

వేదములు

వేదమనగా జ్ఞానము ప్రసాదించునది అని అందురు. దైవమును  చూపు ఒక మార్గము గా పెద్దలు పలుకుదురు. వేదములను శాస్త్ర ప్రకారముగా పలికినా వినినా జ్ఞానము వచ్చును అని మన హిందు ధర్మం పలుకుచున్నది. భారతియ్యులు పవిత్రముగా ఈ వేదములను భావిస్తారు. వేదములు నాలుగు అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము. బ్రహ్మదేవునిచే సృష్టింపబడినవి ఈ వేదములు. ఇవి శ్రుతి , లయ బద్దము గా పలుకవలెనని పెద్దలు చెప్పుదురు. పూర్వము మన ఋషులు యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించినప్పుడు వేదములలో మంత్రములను వినియోగించారు, వేదములు దైవ వాక్కులుగా ఈశ్వరుని విశ్వాసములుగా పరిగణింపపడుచున్నవి.

ఋగ్వేదము 

పాదబద్దములగు మంత్రములను "ఋక్కు" అని అంటారు. ఈ వేదమునందు ఇటువంటి మంత్రములే ఉండుటవలన ఈ వేదమునకు ఋగ్వేదము అని పేరు వచింది. ఈ వేదమునకు 21 శాకాలు కలవు. ఈ 21 శాకలలో ప్రస్తుతం శాకలశాఖ, భాష్కలశాఖ అను 2 శాఖలు మాత్రమే లభించుచున్నవి. ఇందులో వ్యవసాయ విధానం, వ్యాపార విధానం, ఓడలు, విమానం, రైలు, తాయారు చేయు విధానం. టెలిగ్రాం, wire less వంటి ఆధునిక పరికరములు ఏ విధంగా తయారు చేయాలో విఫులంగా వివరింపబడినది. యజ్ఞము, యాగము వంటి చేయు క్రతములలో హవిర్భాగాములు గ్రహించు నిమిత్తం హోయతను ఋత్వికు ఈ వేదమంత్రములతో దేవతలను ఆహ్వానించును. ఆ దేవతలకు హవిస్సులను  అర్పించుటకు చాల ఉపయోగకరమైనది పరిగణింపపడినది. అందుకే ఈ వేదమునకు "హుత్రవేదము" అని పేరు కూడా ఉన్నది. ఈ ఋగ్వేదమును 10 మండలములుగా విభజించారు, వేరొక శాఖ వారు 8 అష్టకములుగా విభజించారు

యజుర్వేదము 

యజుర్వేదములలో కృష్ణయజుర్వేదము, శుక్లయజుర్వేదము అను 2 విధములు కలవు

కృష్ణయజుర్వేదము :- "త్తెత్తిరి" అను పేరుగల ఆచార్యుడు తన శిష్యప్రశిషులకు భోదించెను. అందుకే "త్తెత్తిరీయ" మని పేరు కూడా వచ్చింది. ఈ త్తెత్తిరీయవేదములో సంహిత, బ్రాహ్మణము, అరణ్యము అను 3 భాగములున్నవి. ఈ సంహితము యందు 7అష్టకములు(కాండములు), 44 ప్రశ్నలు(ప్రపాఠకములు), 651 అనువాకములు, 2196 పంచాశత్తులు ఉన్నవి.
ఇందులో కర్మలు చేయు శాస్త్రములు, బ్రహ్మవిద్య, సృష్టివిద్య, గణితవిద్య, శారీరక శాస్త్రవిద్య, అంతరిక్ష విద్య మొదలగున్నవి కలవు.
పనస :- ప్రతీ పనస యందు 50 పదములు ఉన్నవి. అనువాకాంతము యందున్న పనసలకును పదములు కొంచెము హెచ్చుతగ్గులు ఉండును. సంస్కృత భాషలో దీనినే "పంచాశత్తు" అంటారు

మన సదాచారములు

1)తీర్ధము తీసుకొనునపుడు ౩సార్లు విడివిడిగా,ఒకదాని తర్వాత మరొకటి కలవకుండా పుచ్చుకొనవలెను. వెంటవెంటనే మూడుసార్లు ఒకేకాలమున తీసుకొనరాదు.

2)ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి,దానితో రెండు ఒత్తులను(దీపారాధన)వెలిగించాలి. ఉదయంపూట తూర్పు దిశగా రెండు ఒత్తులు ఉండేటట్లు దీపము యొక్క ముఖం ఉండాలి.సాయంత్రము పూట ఒక ఒత్తి తూర్పుగా,రెండవది పడమటగా ఉండాలి.

3)శివునికి అభిషేకం,సూర్యునికి నమస్కారం,విష్ణువుకి అలంకారం,వినాయకునికి తర్పణం,అమ్మవారికి కుమ్కుమపూజ ఇష్టం .ఇవి చేస్తే మంచి జరుగుతుంది.

4)ధైవప్రసాదాన్ని తినాలి కాని పారవేయరాదు.

5)దీపమును నోటితో ఆర్పరాదు.ఒక దీపం వెలుగుచుండగా,రెండవదీపాన్ని మొదటిదీపంతో వెలిగించరాదు. దీపం వెలిగించగానే బయటకు వెళ్ళరాదు.

6)దేవునిపూజకు ఉపయోగించు ఆసనం వేరొకపనికి వాడరాదు.

7)దేవాలయానికి వెళ్ళినపుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం ,స్తోత్రములు చదవకూడదు. ప్రక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి.

8)పురుషులు దేవునికి సాష్టాన్గానమస్కారం చేయవచ్చు.స్త్రీలు చేయరాదు. వారు మోకాళ్ళపై వంగి,నుదురును నేలకు ఆనించి నమస్కారం చెయ్యాలి.

9)యుద్దమునకై శంఖమును పూరించుచున్న కృష్ణుడు మరియు ఒక్కడే నిలబడి వేణువు ఊదుతున్న కృష్ణుడు ఫోటో గాని,విగ్రహం గాని ఇంటిలో ఉండరాదు. మరియు ధ్యానం చేయుచున్న ఈశ్వరుడు,హనుమంతుడు ఫోటోలు ఉండరాదు. లక్ష్మీ దేవి కూర్చునిఉన్న ఫోటోగాని,విగ్రహంగాని ఉండాలి.నిలబడి ఉన్నది వాడరాదు.

10)శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యలో మనుష్యులు నడవరాదు.

11)ఉదయం ,సాయంకాలం రెండు సార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోండి.

12)తులసి దళములను పూజ చేయునపుడు దలములుగానే వెయ్యాలి.ఆకులుగా త్రుంచిన దోషము. మరు జన్మలో భార్యా వియోగము కలుగును. ఏ పుష్పములు అయినా త్రుంచి,ఆకులతో పూజించిన భార్యాభర్తలకు వియోగము సంభవించును.

13)తాకుట వల్ల దోషము లేనివి:(అంటే అంటూ కానివి) తీర్దయాత్రలందు, పున్యక్షేత్రములందు, దేవాలయములందు,మార్గమునందు,వివాహమునండు,సభలందు,పడవలు,కార్లు,రైళ్ళు,విమానాలు మొదలగు వాహనాలలో ప్రయానమందు స్పర్శ దోషం లేదు.

14)ఆదివారం సూర్యుని ఆలయం, సోమవారం శివుడు(మరియు)గౌరిమాత ఆలయం, మంగళవారం) ఆంజనేయస్వామి,సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు,బుధవారం వినాయకుడు మరియు అయ్యప్పస్వామి ఆలయాలు, గురువారం సాయిబాబా, దత్తాత్రేయ,వెంకయ్యస్వామి మొదలగు గురువుల ఆలయాలు, శుక్రవారం అమ్మవారి ఆలయాలు, శనివారం వెంకటేశ్వరస్వామి ఆలయాలు మరియు గ్రామదేవతల ఆలయాలు వారి వారి సంప్రదాయసిద్ధంగా దర్శించుట మంచిది.

15)ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి. శివాలయమునకు వెళ్ళినపుడు మొదట నవగ్రహాలను దర్శించి , ప్రదక్షిణాలు చేసి, కాళ్ళు కడుగుకొని తరువాత శివ దర్శనం చేసుకోవాలి. అదే విష్ణు ఆలయాలు (అనగా రాముడు,కృష్ణుడు,వెంకటేశ్వరస్వామి) దర్శించినపుడు మొదట విష్ణుమూర్తిని దర్శించి తరువాత మిగతావారిని దర్శించాలి. మొదట పాదములను చూసి,తరువాత ఆపాదమస్తకము దర్శించాలి.

16)నవ విధ భక్తి మార్గములు: శ్రవణం (వినటం), కీర్తనం(పాడటం), స్మరణము(మనసులో జపించుట), పాద సేవనము, అర్చన(పూజ), నమస్కారము, దాస్యము(సేవ), సఖ్యము, ఆత్మనివేదనము(మనోనిగ్రహముతో సమర్పించుట) వీటిలో ఏ పద్ధతి ఐనను దేవునికి ప్రీతికరము.

17)జపములు మూడు రకములు.అవి: (ఏ) వాచకజపము:అందరికి వినపడేలా బిగ్గరగా చేసేది. (బి) ఉపామ్సుజపం:ఎవరికి వినపడకుండా పెదాలను కదుపుతూ చేసేది. (సి) మానసజపం: ఎవరికి వినపడకుండా , పెదాలు కదపకుండా, మనసులో చేసేది. అన్ని జపాలలో కెల్లా మానసజపం ఉత్తమం,వాచకజపం సామాన్యం,ఉపంసుజపం మధ్యమం.

18)స్త్రీలు ఓంకారాన్ని జపించకూడదు.

19)ప్రదక్షిణాలు: వినాయకుని ఒకటి,ఈశ్వరునికి మూడు, అమ్మవార్లకు నాలుగు,విష్ణు మూర్తికి నాలుగు,మర్రిచేట్టుకి ఏడు ప్రదక్షిణాలు చెయ్యాలి.

హనుమాన్ చాలీసాలో చెప్పిందే నాసా స్పష్టం చేసింది.

తప్పక చదవండి........(గూగుల్ లో చూడండి.149,600,000 సుమారు )
హనుమాన్ చాలీసాలో చెప్పిందే నాసా స్పష్టం చేసింది.ఇక్కడే మన మహర్షుల మహాత్యం తెలుస్తింది.ఈ క్రింది విషయం పరిశీలంచండి.
హనుమాన్ చాలీసాలో ...

"యుగ సహస్ర యోజన పర భాను,
లీల్యో తాహి మధుర ఫల జాను"

హనుమాన్ చాలీసా వచ్చిన అందరికీ పైన చెప్పిన పంక్తులు తెలుసు.
పై పంక్తులకి అర్ధాన్ని ఒకసారి తెల్సుకుందాం.
భాను అంటే సూర్యుడు.యుగ సహస్ర యోజన అంటే దూరాన్ని తెలియజేస్తుంది.
లీల్యో తాహి మధుర ఫల జాను అంటే ..సూర్యుడిని లీలగా మధురమైన పండు అనుకున్నాడు బాల హనుమంతుడు.
ఇక్కడ భూమికి సూర్యుడికి దూరాన్ని యుగ సహస్ర యోజన అన్నారు.ఈ దూరాన్ని విశ్లేషించుకుందాం.
యుగ -12000 సంవత్సరాలు
సహస్ర -1000
యోజనం- 8 మైళ్ళు
యుగ X సహస్ర X యోజనం
12000X1000=12000000
12000000X8=96000000 మైళ్ళు
ఈ మైళ్లను కిలోమీటర్లోకి మారిస్తే....
ఒక మైలు =1.6 కి .మీ.
96000000X1.6=153600000 ఇది భూమికీ సూర్యుడికి ఉన్న దూరం.(గూగుల్ లో చూడండి.149,600,000 సుమారు ) అని హనుమాన్చాలీసాలో తులసీదాసు ఏ విధంగా చెప్పగలిగాడో నాసా వారికి అంతుచిక్కడం లేదు.
ఎటువంటి టెలిస్కోపులు ఆధునిక పరికరాలు లేకుండా మన మహర్షులు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగాలిగారో ఆలోచించండి.
కేవలం వాళ్ళ తప్పశ్శక్తి, జ్ఞ్యాన నేత్రంతో చూడగలిగారు.
హిందూమతం గొప్పతనం అది.
మీకు నచ్చితే షేర్ చేయండి.మీ అభిప్రాయం చెప్పండి.

షష్టి దేవి స్తుతి


పిల్లలను రక్షిస్తు,వాళ్ళకి ఎలాంటి ఆపదలు దరి చేరనివ్వకుండా చుసుకునే తల్లి......దేవసేనమాత..ఆవిడ షష్టి దేవిగా పూజలు అందుకుంటోంది...
ఈ దివ్యమైన స్తుతి రోజు ఒక్కసారి చదువుకుంటే ఆవిడ పరమ ప్రశన్నురాలై పిల్లలకు రక్షణ గా ఉంటుంది....బాలారిష్టాలు తొలగిపోతాయి ....పిల్లలకు ఆయురారోగ్యాలను ప్రసాదించే అమ్మ...... .షష్టి దేవి నమో నమః

నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమః
శుభాయై దేవసేనాయై షష్ట్యై దేవ్యై నమో నమః
వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః
సుఖ దాయై మోక్షదాయై షష్ట్యై దేవ్యై నమో నమః

సృష్టె షష్ఠాంశరూపాయై సిద్ధాయైచ నమో నమః
మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠీ దేవ్యై నమో నమః
సారయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః
బాలాధిష్ఠా తృ దేవ్యై చ షష్ఠీ దేవ్యై నమో నమః

కల్యాణ దేవ్యై కల్యాణ్యై ఫల దాయైచ కర్మణాం
ప్రత్యక్షా యై సర్వభక్తానాం షష్ఠ్యై దేవ్యై నమో నమః
పూజ్యాయై స్కందకాంతాయై సర్యేషాం సర్వ కర్మసు
దేవ రక్షణ కారిణ్యై షష్ఠీ దేవ్యై నమో నమః

శుద్ధ సత్వ స్వరూపయై వందితాయై నృణాం సదా
హింసా క్రోధ వర్జితాయై షష్ఠీ దేవ్యై నమో నమః
ధనం దేహి జయం దేహి పుత్రందేహి సురేశ్వరీ !
మానం దేహి జయం దేహి ద్విషోజహి మహేశ్వరి

ధర్మం దేహి యశోదేహి షష్ఠీ దేవి నమో నమః
దేహి భూమిం ప్రజాం దేహి విద్యాందేహి సుపూజితే
కల్యాణం చ జయం దేహి విద్యా దేవి నమో నమః
నమోస్తుతే నమోస్తుతే షష్ఠీ దేవి నమో నమః

విభూతిని ఎందుకు పెట్టుకొంటాము?

నెయ్యి మరియు ఇతర వనమూలికలతో కలిపి ప్రత్యేకమైన సమిధలతో భగవంతునికి హోమంలో ఆహూతిగా సమర్పించినపుడు అందులోనుంచి వచ్చిన భస్మమే విభూతి. లేదా విగ్రహానికి భస్మముతో అభిషేకము చేసిన దానిని విభూతిగా పరిగణిస్తారు. అంతే కానీ కాలిన ప్రతి వస్తువు యొక్క బూడిద విభూతిగా పరిగనించబడదు. విభూతిని సాధారణంగా నుదిటి మీద పెట్టుకొంటారు. కొందరు దానిని భుజాలు చాతీ మొదలైన ఇతర శరీర భాగాల మీద కూడా పెట్టుకుంటారు. కొందరు, ఆస్తికులు శరీరానికి అంతటికీ దీనిని రుద్దుకొంటారు. చాలా మంది భస్మాన్ని స్వీకరించినప్పుడల్లా చిటికెడు నోట్లో వేసికొంటారు. విభూతిని ఎందుకు ధరించాలి?భస్మము అనే మాటకు "మన పాపాలను భస్మము చేసేది, భగవంతుడిని జ్ఞాపకము చేసేది" అని అర్ధము. "భ" అంటే భస్మము చేయడాన్ని; "స్మ" స్మరణమును సూచిస్తున్నాయి. అందువలన భస్మధారణ దుష్టత్వాన్ని నిర్మూలించి, దివ్యత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. భస్మము .. ధరించిన వారికి శోభనిస్తుంది గనుక "విభూతి" (శోభ) అనీ, దానిని పెట్టుకున్న వారిని పరిశుద్ద పరచి వారిని అనారోగ్యత, దుష్టతలనుండీ రక్షిస్తుంది గనుక రక్ష అని అంటాము. హోమము (పవిత్రమైన మంత్రాలతో అగ్ని దేవుడికి సమర్పించే నివేదన) అహంకారము స్వార్ధ కామనలను జ్ఞానమనే అగ్నికి లేదా ఒక ఉన్నత నిస్స్వార్ధ కారణార్ధముకు ఆహుతిగా సమర్పించడానిని సూచిస్తుంది. తద్వారా వచ్చే భస్మము అటువంటి పనులు ఫలితంగా వచ్చే మానసిక పరిశుద్దతను సూచిస్తుంది. నివేదనలను, సమిధలను అగ్నిలో దహింపజేయడమనేది జ్ఞానమనే అగ్నిలో అజ్ఞానము, సోమరి తనాన్ని వదిలించు కోవడాన్ని సూచిస్తుంది. మనము ధరించే భస్మము, ఈ శరీరములో నున్న అసత్యపు తాదాత్మ్యత మరియు జనన మరణాల పరిమితుల నుంచి విడివడి స్వతంత్రుల మవ్వాలని సూచిస్తుంది. శరీరము నశించేదని, ఒకనాడది బూడిదగా అవుతుందని కూడా మనకు భస్మ ధారణ గుర్తు చేస్తుంది. అందువలన మనము దేహముపై మితిమీరిన మమకారం కలిగి ఉండకూడదు. మరణమనేది ఏ క్షణానైనా రావచ్చు. ఈ గ్రహింపు జీవితాన్ని ఉత్తమోత్తమముగా వినియోగించుకొని అభివృద్ధి మార్గాన పయనించే లాగున చేస్తుంది. అంతేకాని మరణాన్ని గురించి జ్ఞాపకము చేసే దుఃఖ భరితమైనదని అపార్ధము చేసికో కూడదు. కాలము ఎవరి కోసం నిలబడదని తెలియజేసే శక్తివంతమైన సూచిక ఈ భస్మము. శరీరమంతటా భస్మాన్ని రాసుకోనేటటువంటి పరమ శివునితో ఈ భస్మము ప్రత్యేకమైన సంబంధము కలిగి ఉంది. శివ భక్తులు భస్మాన్ని త్రిపుండ్రాకారంలో ధరిస్తారు. మధ్యలో ఎర్రని బొట్టుతో కలిపి పెట్టుకున్నప్పుడు ఆ గుర్తు శివ శక్తులను సూచిస్తుంది. కట్టెలన్నీ(పదార్ధాలు) కాలిపోయిన తరువాత మిగిలేది బూడిద. దానికి నాశనము లేదు. అదే విధముగా లెక్కలేనన్ని నామ రూపాలతో కూడిన సృష్టి అంతా నశించినప్పుడు మిగిలి ఉండేది, నాశనము లేనటువంటి శాశ్వత సత్యము ఐన భగవంతుడు మాత్రమె. "భస్మము" ఔషధగుణాలని కలిగి ఉంది. ఇది ఎన్నో ఆయుర్వేద మందులలో వాడ బడుతుంది. ఇది శరీరములోని అధిక శీతలతను పీల్చుకొంటుంది. జలుబు, తలనొప్పులు రాకుండా కాపాడుతుంది . భస్మాన్ని నుదుట ధరించేటప్పుడు మృత్యుంజయ మంత్రము చెప్పాలని ఉపనిషత్తులు చెపుతున్నాయి. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుక మివ బంధనాత్ మ్రుత్యోర్ముక్షీయ మామృతాత్ మనల్ని పోషించేటటువంటి, మన జీవితాలలో పరిమళాలను వ్యాపింప చేసేటటువంటి త్రినేత్రధారుడైన శివుడిని పూజిద్దాము. అతడు మనల్ని దుఃఖము మరియు మరణాల సంకెళ్ళనుండి పండిన దోసకాయ తోడిమ నుండి విడిపోయే టంత సులభంగా విడిపించును గాక.

దర్శనం అయ్యాక ఆలయంలో ఎందుకు కుర్చోవాలి

స్వామి దర్శనము, షడగోప్యము అయ్యాక కొంతసేపు కూర్చొని వెళ్ళాలి అని అంటారు పెద్దలు.
అలా కూర్చుంటే మనసుకు ప్రశాంతత ,పుణ్యం అని పెద్దల పలుకు.
అలా కూర్చోకుండా వెళ్తే భగవంతుని దర్శించిన ఫలితం కుడా రాదూ అని అంటారు.
అలా ఆలయంలో ప్రశాంతంగా కూర్చొని మంచీ, చెడులను ఆలోచించి మంచి వైపు మార్గాన్ని ఎంచుకొనే అవకాశాన్ని మన మనసుకు యిస్తాము.
మనం రొజూ చేసే పనులలో మంచిని ఎంచుకొనే అవకాశం దక్కుతుంది.
ఇలా ఆలయంలో కూర్చోవడం ఒక రకమైన ద్యానం వంటిది. అలా ఒక 2నిమిషాలా పాటు మౌనముగా కూర్చొని మనం దర్శించిన ఆ భగవంతుని తిరిగి స్మృతి చేసుకుంటే వచ్చే ఆ ఆనందం, ప్రశాంతత చాలా ఉత్తమమైనది